Election Results 2024: హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు..

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 42 సీట్లు దక్కాయి.

Election Results 2024: హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు..

Haryana, Jammu And Kashmir Election Results 2024

Updated On : November 7, 2024 / 3:25 PM IST

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. హరియాణాలో బీజేపీ, జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి గెలుపొందాయి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 08 Oct 2024 07:02 PM (IST)

    నేషనల్‌ కాన్ఫరెన్స్‌కి 42 సీట్లు

    జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయింది. మొత్తం 90 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కి 42, బీజేపీకి 29, కాంగ్రెస్‌కి 6, పీడీపీకి 3, సీపీఎంకి 1, ఆప్‌కి 1, జేపీసీ 1, స్వతంత్రులు 7 సీట్లు వచ్చాయి.

  • 08 Oct 2024 05:11 PM (IST)

    ఎన్నికల కౌంటింగ్‌పై కాంగ్రెస్ సందేహాలు

    హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ తీర్పును అంగీకరించలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. హరియాణా ఎన్నికల కౌంటింగ్‌పై కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తింది. వ్యవస్థ గెలిచిందని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పింది.

  • 08 Oct 2024 04:18 PM (IST)

    నేషనల్ కాన్ఫరెన్స్ నేతల సంబరాలు

    నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లలో ఇప్పటివరకు ఎన్సీ 40 గెలవగా, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

     

  • 08 Oct 2024 02:03 PM (IST)

    జమ్మూ కశ్మీర్ లోని దోడా అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్ధి మెహ్రాజ్ మాలిక్ 4వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Oct 2024 02:01 PM (IST)

    హర్యానాలోని హన్సి అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి వినోద్ భయానా విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మక్కర్ 21 వేల 460 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి 2333 ఓట్లు వచ్చాయి. జేజేపీ అభ్యర్థికి 516 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

  • 08 Oct 2024 01:53 PM (IST)

    జులనా అసెంబ్లీ స్థానం నుంచి రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. 15 రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఆయన బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 08 Oct 2024 01:27 PM (IST)

    హరియాణాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వినేశ్ ఫొటాట్ విజయం దిశగా పయణిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధిపై 5వేలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Oct 2024 01:22 PM (IST)

    హర్యానాలో బీజేపీ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ సాధించే దిశగా దూసుకుపోతుంది. ఎన్నికల సంఘం ప్రకారం హర్యానాలో బీజేపీ 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

  • 08 Oct 2024 01:11 PM (IST)

    హరియాణాలో ఎన్నికల ఫలితాల ఆలస్యంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరా రమేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల ఆలస్యంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఫలితాలపై మైండ్ గేమ్ ఆడుతున్నారని, అయినా, హరియాణాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జైరాంరమేశ్ దీమా వ్యక్తం చేశారు.

  • 08 Oct 2024 12:46 PM (IST)

    జమ్మూకశ్మర్ లోని బసోహ్లి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం సాధించారు.
    జమ్మూకశ్మీర్ లోని గురేజ్ అసెంబ్లీ స్థానం నుంచి నజ్మీర్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు.

  • 08 Oct 2024 12:11 PM (IST)

    హర్యాణాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ మూడోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి 49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇతరులు ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Oct 2024 11:40 AM (IST)

    ఉదయం 11.30 గంటలకు ఫలితాలు ఇలా..

    Election Results 2024

  • 08 Oct 2024 11:25 AM (IST)

  • 08 Oct 2024 11:23 AM (IST)

    జమ్మూకశ్మీర్ లో బీజేపీ బోణీ కొట్టింది. కథువాలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ ఘన విజయం సాధించారు.

  • 08 Oct 2024 11:20 AM (IST)

  • 08 Oct 2024 11:15 AM (IST)

    జమ్మూకశ్మీర్‌లో ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎన్‌సి-కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 08 Oct 2024 11:11 AM (IST)

    హరిణాలో తాజాగా ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆఖరి విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

  • 08 Oct 2024 10:49 AM (IST)

    వినేశ్ ఫొగాట్ వెనుకంజ..

    హర్యాణాలోని జులానా అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. ఫొగాట్ పై బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Oct 2024 10:42 AM (IST)

    హర్యానాలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 31 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లువ చ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • 08 Oct 2024 10:38 AM (IST)

    జమ్మూకశ్మీర్ లోనూ క్రమంగా బీజేపీ పుంజుకుంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థులు 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 8, పీడీపీ మూడు, స్వతంత్రులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Oct 2024 10:10 AM (IST)

  • 08 Oct 2024 09:55 AM (IST)

    హర్యానాలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటుంది. బీజేపీ అభ్యర్థులు 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 37 స్థానాలకు పడిపోయింది.

  • 08 Oct 2024 09:46 AM (IST)

    పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Oct 2024 09:41 AM (IST)

    జమ్మూకశ్మీర్ లో స్వతంత్ర అభ్యర్థుల జోరు కొనసాగుతుంది. 11 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ 36, బీజేపీ 26, కాంగ్రెస్ ఏడు, పీడీపీ అభ్యర్థులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Oct 2024 09:37 AM (IST)

    లడ్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ వెనుకంజలో ఉన్నారు.

  • 08 Oct 2024 09:33 AM (IST)

    తాజా సమాచారం ప్రకారం..
    హర్యానాలోని మొత్తం 90 స్థానాల్లో.. 56 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థులు 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Oct 2024 09:29 AM (IST)

    జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి.

  • 08 Oct 2024 09:28 AM (IST)

    జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 16 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 14, కాంగ్రెస్ 8, పీడీపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Oct 2024 09:27 AM (IST)

    ఉదయం 9గంటల వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.. హరియాణా లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 28 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.