Sri Krishna Janmabhoomi : ఇక శ్రీకృష్ణ జన్మభూమి కేసులన్నీ అలహాబాద్ హైకోర్టులోనే విచారణ
భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారతదేశం సొంతం. అలాగే దేవాలయాలు, మసీదుల వివాదాలు కూడా భారత్ లో కొనసాగుతున్నాయి. దేవాలయాలు, మసీదుల భూముల వివాదాలు కోర్టుల్లో కొనసాగుతునే ఉన్నాయి. రామ జన్మభూమి మసీదు వివాదం ముగిసాక శ్రీకృష్ణుడు జన్మభూమి వివాదం కొనసాగుతోంది.

Mathur Sri Krishna Janmabhoomi
Mathur Sri Krishna Janmabhoomi : ఇక శ్రీకృష్ణ జన్మభూమి కేసులన్నీ అలహాబాద్ హైకోర్టులోనే విచారణ
రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత శ్రీకృష్ణ జన్మభూమి వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై పలు పిటీషన్లు ఆయా స్థానిక కోర్టుల్లో దాఖలయ్యాయి. ఈకేసుల విచారణ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దిగువ కోర్టుల్లో దాఖలు అయ్యి కేసులన్నీ ఇక హైకోర్టులోనే విచారించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కేసుల విచారణ ఇకపై అలహాబాద్ హైకోర్టులో సాగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి దాఖలు అయిన కేసులన్నింటిని బదిలీ చేసుకుంటూ అలహాబాద్ హైకోర్టు శుక్రవారం (మే 26,2023)కీలక ఆదేశాలు జారీ చేసింది. మథుర కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులన్నింటిని హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది.
Sri Krishna Birthplace : శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెబుతున్న మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది ?
దీంతో ఇక మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి స్థల వివాదానికి సంబంధించిన కేసుల విచారణ ఇకపై అలహాబాద్ హైకోర్టులోనే జరగనుంది. దిగువ కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంటూ అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మథురలో ఉన్న షాషీ మసీదు ఈద్గా స్థలంపై హక్కు తమకే ఉందని హిందు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మథుర కోర్టులో పలు పిటీషన్లు దాఖలు చేయగా ఈ కేసు విచారణ మథుర కోర్టులోనే కొనసాగుతోంది.
శ్రీకృష్ణుడి భక్తులకు సంబంధించిన ఈ కేసు జాతీయ ప్రాధాన్యత కలిగిందని శ్రీకృష్ణ జన్మభూమి కేసుల విచారణ హైకోర్టులోనే జరగాలని కోరుతూ స్వయంగా శ్రీకృష్ణుడి పేరుతో రంజనా అగ్నిహోత్రి మరో ఏడుగురు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై వాదనలు జరగటం వాయిదా వేయటం జరిగింది. దీనిపై తిరిగి విచారణ చేపట్టగా అలహాబాద్ హైకోర్టు తాజాగా వెలురిస్తు వివిధ కోర్టులో దాఖలైన కేసులన్నింటినీ విచారణ ఇక తామే జరుపుతామని..ఈ కేసులన్నీ బదిలీ చేయాలని ఆదేశించింది.
Sri Krishna Janmabhoomi Row : శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు..మసీదులో సర్వే చేయాలని మథుర కోర్టు తీర్పు
కాగా శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని దాఖలు అయిన పిటీషన్ పై విచారణ కొనసాగించి మథుర కోర్టు ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీయాలని 2022 డిసెంబర్ లో పురావస్తుశాఖను ఆదేశించింది. ఈ స్థలంలో సర్వే చేపట్టి నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను పురావస్తుశాఖకు అప్పగించింది. శ్రీకృష్ణుడు జన్మస్థలంగా భావిస్తున్న షాహీ ఇద్గా మసీదులో జనవరి 2,2023 నుంచి సర్వే చేపట్టాలని పురావస్తుశాఖకు సూచించింది.ఇలా పలు కేసులపై విచారణలు కొనసాగుతుండగా ఇక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈకేసుల విచారణలు అన్నీ హైకోర్టులోనే జరుగనున్నాయి.
అప్పుడు అయోధ్యలో రాముడు,ఇప్పుడు మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: మసీదుని తొలగించాలని పిటీషన్ .