Anand Mahindra : “అతడు ఆత్మ నిర్భరత కలిగిన వ్యక్తి”- ప్రదీప్ మెహ్రా గురించి ఆనంద్ మహీంద్రా
ఆర్మీలో చేరాలనే తన కల నెరవేర్చుకోటానికి రాత్రి పూట నోయిడా వీధుల్లో 10 కిలోమీటర్లు పరుగు పెడుతున్న ప్రదీప్ మెహ్ర అనే 19 ఏళ్ళ యువకుడి వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న

Anand Mahindra
Anand Mahindra : ఆర్మీలో చేరాలనే తన కల నెరవేర్చుకోటానికి రాత్రి పూట నోయిడా వీధుల్లో 10 కిలోమీటర్లు పరుగు పెడుతున్న ప్రదీప్ మెహ్ర అనే 19 ఏళ్ళ యువకుడి వీడియో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ వీడియో చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే…. ” ఆ యువకుడి జీవితం ఆత్మనిర్భరతకు ప్రతీక అని కొని యాడారు”. “ఇది నిజంగా స్పూర్తిదాయకం.. అయితే అతడి కధ నుంచి నేను పొందిన స్ఫూర్తి ఏమిటో తెలుసా ? ఆయువకుడు ఎవరి మీదా ఆధార పడని వ్యక్తి.. లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు.
అతడికి ఎవరి సాయం అవసరం లేదు. అతడు ఆత్మనిర్భరత కలిగిన వ్యక్తి” అని మహీంద్రా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రదీప్ మెహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వినోద్ కాప్రీ పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే..
19ఏళ్ల యువకుడు అర్ధరాత్రి రోడ్డుపై పరిగెడుతూ ఇంటికి వెళ్తున్నాడు. అది గమనించిన సినిమా డైరక్టర్.. అలా వెళ్లడానికి కారణం అడగ్గా.. యువకుడి మాటలు విని ఫిదా అయిపోయాడు. నోయిడా ఖాళీ వీధుల్లో కల నెరవేర్చుకునేందుకు కిలోమీటర్ల తరబడి పరుగు తీస్తూ ప్రయత్నిస్తున్నాడు.
ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ కంట పడ్డాడు 19ఏళ్ల యువకుడైన ప్రదీప్ . నోయిడా వీధుల్లో పరుగెత్తుతూ వెళ్తున్నాడు. కుతూహలంతో యువకుడిని ప్రశ్నించాడు ఫిల్మ్ మేకర్. అంతే ఆ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. యువకుడి పరుగు సాగుతూనే ఉంది. అలా తాను రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తుతూనే ఇంటికి వెళ్తానని చెప్పాడు.
ప్రస్తుతం తాను మెక్ డొనాల్డ్ సెక్టార్ 16లో పనిచేస్తున్నానని చెప్తూనే.. వినోద్ కాప్రీ తన కారులో దించుతానని చెప్పినప్పటికీ నో చెప్పేశాడు. కారు ఎక్కితే తనకు ఈ రోజు పరిగెత్తే అవకాశం మిస్ అయిపోతానని, ఇలా పరుగు ప్రాక్టీస్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఉదయం సమయంలో పరిగెత్తడం ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడిగితే.. ఉదయం 8గంటలకు లేచి పనికి వెళ్లడాని కంటే ముందే వంట చేయాలని.. రాత్రి పూటనే పది కిలోమీటర్ల పరుగు సాధ్యపడుతుందని చెప్పాడు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత వంట చేసుకుని తిని తన తమ్ముడికి పెట్టాలట. మంచాన పడ్డ తల్లిని చూసుకుని తిరిగి తెల్లారే పనిలోకి రావాలని చెప్తున్నాడు ఆ టీనేజర్.
Also Read : Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ..హైదరాబాద్ లో ఎంతంటే ….
ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చేసిన పోస్టు వైరల్ అయి లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్), లెఫ్టినెంట్ జనరల్ వరకూ చేరింది. తనకు తానుగా ఆ యువకుడికి సాయం చేస్తానంటూ ముందుకొచ్చారాయన. ‘అతని ఉత్సాహం వెలకట్టలేనిది. రిక్రూట్మెంట్ టెస్టుల్లో మెరిట్‌లో పాస్ అయ్యేందుకు సాయం చేయాలను కుంటున్నా. అని రెజిమెంట్ కల్నల్, లెఫ్టినెంట్ జనరల్ రానా కలితా చెప్పారు.
This is indeed inspiring. But you know what my #MondayMotivation is? The fact that he is so independent & refuses the offer of a ride. He doesn’t need help. He is Aatmanirbhar! https://t.co/8H1BV4v5Mr
— anand mahindra (@anandmahindra) March 21, 2022