Navjot Sidhu : సీఎం చన్నీ కాంగ్రెస్ ను ముంచేస్తాడు..సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

 పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Navjot Sidhu : సీఎం చన్నీ కాంగ్రెస్ ను ముంచేస్తాడు..సిద్ధూ  సంచలన వ్యాఖ్యలు

Punjabn

Updated On : October 8, 2021 / 9:35 PM IST

Navjot Sidhu   పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సన్నిహితుల వద్ద సీఎం చన్నీ గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లో నలుగురు రైతులు సహా తొమ్మిది మరణాలు చోటుచేసుకున్న లఖింపూర్ ఖేరీ ఘటనను నిరసిస్తూ సిద్ధూ గురువారం ఆందోళన ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో సిద్ధూ..తన పక్కనున్నవాళ్లతో.. సీఎం చన్నీ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముంచేస్తాడంటూ వ్యాఖ్యానించారు. సిద్ధూ మరియు ఇరత కాంగ్రెస్ నాయకులు మొహాలీ ఎయిర్ పోర్ట్ వద్ద సీఎం చన్నీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.