కోల్ కతా నడిబొడ్డున…అమిత్ షా ర్యాలీలో మార్మోగిన “గోలీ మారో” నినాదాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 01:53 PM IST
కోల్ కతా నడిబొడ్డున…అమిత్ షా ర్యాలీలో మార్మోగిన “గోలీ మారో” నినాదాలు

Updated On : March 1, 2020 / 1:53 PM IST

నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా ర్యాలీలో గోలీ మారో నినాదాలు మార్మోగాయి. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  ఆదివారం కోల్‌ కతాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో అమిత్ షా సీఏఏ గురించి మాట్లాడారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై షా ఫైర్ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం ఆపేందుకు మమత ప్రభుత్వం అల్లర్లకు పాల్పడుతోందని,రైళ్లు తగులబెడుతోందని ఆరోపించారు. 

బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అయితే ర్యాలీలో కాషాయ రంగు దుస్తులు ధరించి,బీజేపీ జెండా పట్టుకున్న కొందరు..దేశానికి ద్రోహం చేస్తున్నవారందరినీ కాల్చిపడేయాలంటూ పెద్దగా నినాదాలు చేశాడు. అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పరిసర ప్రాంతాల్లోకి రాగానే ‘గోలీమారో… గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఎవరు ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా గోలీమారో నినాదాలు చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా బీజేపీ నేతలు… కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేసినా సరే, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నాయి. గోలీమారో నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్‌ సీపీఎం శాఖ డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోలీమారో నినాదాలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.