బెంగళూరులో భారీ వరదలు : పసికందును కాపాడిన యువకుడు, వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 11:35 AM IST
బెంగళూరులో భారీ వరదలు : పసికందును కాపాడిన యువకుడు, వీడియో వైరల్

Updated On : October 24, 2020 / 12:17 PM IST

heavy rains bengaluru men save babies : మొన్నటి వరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీచెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు…పలు ప్రాంతాలు నీట మునిగాయి.



నగరంలోని జేసీ రోడ్డు ప్రాంతం పూర్తిగా నీట మునగడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో..ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదిలా ఉంటే..శుక్రవారం సాయంత్రం సౌత్‌ బెంగళూరులో వరద ధాటికి సుమారు 500 వాహనాలు కొట్టుకుపోయాయి.



https://10tv.in/ecg-on-apple-watch-to-saves-61-years-old-man-life-in-indore/
దాదాపు 300 ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇంటి పైకప్పులు ఎక్కారు. హొసకొరెహళ్లిలో ఓ యువకుడు…15 రోజుల పాపాయిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. పసిపాపను చేతుల్లో పైకి ఎత్తుకుని..భుజం వరకు లోతుగా ఉన్న నీళ్లలోనే మెల్లిగా వెళుతూ..తల్లి ఒడికి చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వరద నీటిలో చిక్కుకున్న మరో చిన్నారిని కూడా రక్షించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



హోసకెరహళ్లిలో మురుగు నీటి కాలువ ఉప్పొంగడంతో ఓ కారు అందులో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలాచోట్ల అపార్ట్‌మెంట్లలో, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి.. రానున్న రెండు రోజులు పాటు కర్నాటకలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.