ప్రచండ గాలులు, కుండపోత వర్షాలు : ముంచుకొస్తున్న మహా తుఫాన్
మహా తుఫాన్ ముంచుకొస్తోంది. జల ప్రళయం తీసుకొస్తోంది. కుండపోత వానలు, ప్రచండ గాలులు.. వణికించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుఫాన్

మహా తుఫాన్ ముంచుకొస్తోంది. జల ప్రళయం తీసుకొస్తోంది. కుండపోత వానలు, ప్రచండ గాలులు.. వణికించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుఫాన్
మహా తుఫాన్ ముంచుకొస్తోంది. జల ప్రళయం తీసుకొస్తోంది. కుండపోత వానలు, ప్రచండ గాలులు.. వణికించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘మహా’ తుఫాన్ గురువారం(అక్టోబర్ 31,2019) మరింత తీవ్రమైన తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. లక్షద్వీప్ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న ‘మహా’ తుఫాన్ తూర్పు మధ్య అరేబియా సముద్రం కేంద్రంగా లక్షద్వీప్ సమీపాన 90 కి.మీ. దూరంలోని అమినిదీవి, చెట్లాట్‌కు ఈశాన్య దిశగా 25 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
ఉత్తర లక్షద్వీప్ దీవుల మీదుగా ఉత్తర-వాయవ్య దిశగా తుపాన్ ముందుకు వెళ్లనున్నది. దీని ప్రభావంతో గంటకు 100-110 కి.మీ నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో సముద్ర అలలు ఒక మీటర్ ఎత్తుకు ఎగసి పడటంతో వచ్చే 12 గంటల్లో లక్షద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరించింది. నవంబర్ 4వ తేదీ వరకు ఆగ్నేయ అరేబియా సముద్ర పరిధిలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.
తుఫాన్ ప్రభావం కేరళ, కర్నాటక రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొచ్చి, పరావర్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ బృందాలను రంగంలోకి దింపాయి.