PPE Suitలతో జ్యూయలరీ షాపులో దొంగతనం

పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE)కరోనా నుంచి కాపాడుకోవడానికే కాదు.. దొంగతనాలకీ వాడేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన జ్యూయలరీ షాప్ ను బద్దలగొట్టి 780గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. జ్యూయలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
కప్ బోర్డుల్లో ఉన్న బంగారాన్ని, షో కేసుల్లో ఉన్న నగలను దోచుకెళ్లారు. రెండు రోజుల పాత వీడియో క్లిప్పింగులను పరిశీలించి నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. వారంతా క్యాప్ లు, మాస్క్ లు, ప్లాస్టిక్ జాకెట్లు, హ్యాండ్ గ్లౌజులు ధరించి డిస్ ప్లేకు పెట్టిన బంగారాన్ని తీసుకెళ్లిపోయారు.
లోకల్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు జ్యూయలరీ షాప్ ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 78తులాల బంగారం దొంగిలించిపోరిపోయినట్లు అధికారులు వెల్లడించారు. షాప్ గోడ పగుల కొట్టి లోపలికి వచ్చిన వాళ్లు నగలను సులువుగా తీసుకెళ్లిపోయారు.
Read Here >>ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్..