ఈ కోడి పెట్ట స్టైలే వేరు: ఈ గుడ్లు వెరీ గుడ్డు

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 07:38 AM IST
ఈ  కోడి పెట్ట స్టైలే వేరు: ఈ గుడ్లు  వెరీ గుడ్డు

హుచ్చమ్మనహళ్ళి : కోడిపెట్ట గుడ్లు పెట్టటం మామూలే. కానీ కోడిపెట్టల్లో ఈ కోడి వెరీ స్పెషల్. నా స్టైలే వేరంటోంది..అన్ని కోళ్లలా కాదు నేను గుడ్లు పెట్టటంలో నేను చాలా చాలా వెరైటీ అంటోంది. సాధారణంగా కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా హుచ్చమ్మనహళ్ళి గ్రామంలోని ఈ కోడి మాత్రం పదిరోజుల్లో 35 గుడ్లు పెట్టి అందరితోను వెరీ గుడ్ అనిపించుకుంటోంది. 

హుచ్చమ్మనహళ్ళి లోని యల్లమ్మకు చెందిన 8 నెలల వయస్సున్న కోడి పెట్ట ఈ ఘనతను సాధించింది. కాగా కోళ్లలో పిండం అభివృద్ధి దశలో ‘సూపర్‌ ఓవలేషన్‌’ అనే ప్రక్రియ జరిగితేనే ఇలా అధిక సంఖ్యలో గుడ్లు పెట్టడం సాధ్యమని పశువైద్యాధికారులు చెప్పారు. లక్ష కోళ్లలో ఒక దానికి ఇలాంటి ఘటనలు సంభవిస్తుంటాయన్నారు. మరి ఆ లక్ష కోళ్లలో ఈ యల్లమ్మ కోడి రికార్డు సృష్టించింది. ఈ కోడి మాపాలిట బంగారు కోడి పెట్ట అంటు మురిసిపోతోంది.