Solar Eclipse: మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో దేశంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సూర్య గ్రహణం కోసం సామాన్య ప్రజలు, శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, దేశంలో ఈ రోజు కనిపించే పాక్షిక సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైంది.
WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు
ఎందుకంటే మన దేశంలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత కనిపించబోతున్న పాక్షిక సూర్య గ్రహణమిది. చివరిగా 2007లో దేశంలో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఇక ఈ సారి మిస్సైతే మళ్లీ దేశంలో సూర్య గ్రహణం కనిపించేది మరో పదేళ్ల తర్వాతే. నవంబర్ 3, 2032లోనే తిరిగి మన దేశంలో సూర్య గ్రహణాన్ని చూడొచ్చు. ఈ ఏడాది ఇంకో సూర్య గ్రహణం ఉన్నప్పటికీ, అది మన దేశంలో కనిపించే అవకాశం లేదు. మరోవైపు సూర్య గ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని చూడొచ్చు. అయితే, సూర్య గ్రహణాన్ని చూడాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్ట్‌గా కళ్లతో సూర్య గ్రహణాన్ని చూస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
Young Girl: ఇదీ నేటి సమాజం.. గాయాలు, రక్తస్రావంతో అమ్మాయి.. సాయం చేయకుండా వీడియోలు తీసుకున్న జనం
అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన సోలార్ ఫిల్టర్స్, స్పెషల్ గ్లాసెస్ ఉపయోగించి మాత్రమే గ్రహణాన్ని చూడాలి. కళ్లద్దాలు వాడే వాళ్లు వాటిని తీయకూడదు. కళ్లద్దాలు పెట్టుకుని, ఆపై వేరే లెన్స్ లేదా ఫిల్టర్స్ వాడి సూర్య గ్రహణాన్ని చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో 49 నిమిషాలపాటు సూర్య గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 4.49 నిమిషాల నుంచి, విశాఖపట్నంలో సాయంత్రం 5.01 నిమిషాల నుంచి గ్రహణం కనిపిస్తుంది.