Young Girl: ఇదీ నేటి సమాజం.. గాయాలు, రక్తస్రావంతో అమ్మాయి.. సాయం చేయకుండా వీడియోలు తీసుకున్న జనం

రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో గాయాలతో, రక్తస్రావంతో పడి ఉందో బాలిక. అయితే, స్థానికులు ఆమెకు సాయం చేయాల్సింది పోయి, చుట్టూ చేరి వీడియోలు తీసుకున్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Young Girl: ఇదీ నేటి సమాజం.. గాయాలు, రక్తస్రావంతో అమ్మాయి.. సాయం చేయకుండా వీడియోలు తీసుకున్న జనం

Updated On : October 25, 2022 / 3:49 PM IST

Young Girl: రోడ్డు పక్కన ఎవరైనా గాయపడి, ప్రమాదంలో ఉంటే జనం వారికి సాయం చేయాల్సింది పోయి వీడియోలు తీసుకుంటున్నారు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలన్న ఆలోచన తప్ప.. ఆ మనిషికి సాయం చేద్దామనే ఆలోచనే రావడం లేదు జనాలకి.

WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

కావాలంటే ఈ వీడియో చూస్తే ఆ విషయం మరోసారి అర్థమవుతుంది. ఉత్తర ప్రదేశ్, కన్నౌజ్ సమీపంలోని తీర్వా గెస్ట్ హౌజ్ వద్ద పన్నెండేళ్ల బాలిక గాయాలతో, రక్తస్రావంతో పడి ఉంది. ఆ బాలిక లేచి నడవలేని స్థితిలో ఉంది. బాలికను గమనించిన స్థానికులు ఆమెకు సాయం చేసి, వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయాల్సింది పోయి వీడియోలు తీసుకున్నారు. బాలిక చుట్టూ చేరిన జనం వీడియోలు తీస్తూ కనిపించారు. ఆ బాలికేమో సాయం కోసం అర్థిస్తోంది. కానీ, ఆ జనం మాత్రం వీడియోలు తీసుకోవడంపైనే దృష్టిపెట్టారు. చివరకు బాలిక విషయం తెలిసి, పోలీసులు వచ్చి, ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం బాలికను కాన్పూర్ తరలించారు.

WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

బాలిక గాయపడి, రక్త స్రావంతో ఉండటంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, బాలిక గత ఆదివారం తన ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తన కోసం వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గెస్ట్ హౌజ్ దగ్గర నిస్సహాయ స్థితిలో బాలిక కనిపించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు రోజులపాటు బాలికతో ఎవరైనా ఒక మగ వ్యక్తి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు అత్యాచారం, లైంగిక దాడి కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. దగ్గర్లోని సీసీ టీవీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు.