కరోనా కట్టడికి హీరో మొబైల్ అంబులెన్స్‌లు

  • Published By: veegamteam ,Published On : April 14, 2020 / 12:28 PM IST
కరోనా కట్టడికి హీరో మొబైల్ అంబులెన్స్‌లు

Updated On : April 14, 2020 / 12:28 PM IST

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కి కాల్ చేస్తాం. అంబులెన్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో, అసలు ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రాబ్లేమ్ త్వరలోనే పోనుంది.  Hero MotoCorp మంగళవారం (ఏప్రిల్ 14, 2020)న కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా భారతదేశ పోరులో సహాయపడటానికి  Responder Mobile Ambulances 60 యూనిట్లను విరాళంగా ఇవ్వనుంది.

ఈ అంబులెన్స్‌లు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్పీడుగా వెళతాయి. ఈ మొబైల్ అంబులెన్స్‌లు hero xtreme 200r మోటార్ సైకిల్ ను రీమోడల్ చేసి, మొబైల్ అంబులెన్స్ గా మార్చారు. ఇందులో పేషెంట్ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆక్సిజన్ సిలిండర్, సైరెన్ ఉంటాయి. 

ఈ మొబైల్ అంబులెన్స్‌లను దేశవ్యాప్తంగా అధికారులకు అందించనున్నారు. హీరో గ్రూప్  100కోట్ల రూపాయలు విరాళమిచ్చింది. అందులో సగం PM-Cares Fundకు ఇస్తామని, మిగిలినవి వివిధ సహాయక చర్యలకు ఖర్చు చేస్తామని హీరో సంస్థ ప్రకటించింది.