×
Ad

Deepavali : దీపావళి సందర్భంగా క్రాకర్‌ టైమ్‌ ఇదే…బాంబే హైకోర్టు సంచలన ఆదేశం

దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు....

  • Published On : November 11, 2023 / 05:35 AM IST

cracker-time

Bombay High Court : దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు. ముంబయి నగరంలో క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిని హైకోర్టు సవరించింది. అంతకుముందు క్రాకర్లు పేల్చడానికి మూడు గంటల సమయం నుంచి రెండు గంటలకు తగ్గించింది. ముంబయి నగరంలోనూ పెరుగుతున్న వాయు కాలుష్య పరిస్థితిని ప్రస్థావిస్తూ హైకోర్టు బెంచ్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ALSO READ : Tula Uma : తుల ఉమ.. కారు ఎక్కుతారా? హస్తం గూటికి చేరతారా? ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం

మొదట్లో క్రాకర్స్ పేల్చడానికి మూడు గంటల సమయం సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు అనుమతించిన ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులను ఉటంకిస్తూ శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కాలపరిమితిని సవరించింది. భవన వ్యర్థాల రవాణాపై నిషేధాన్ని కొనసాగించాలని కోరింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ముంబయిలో వాయు కాలుష్యం తగ్గిందని అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ చెప్పారని, కానీ ఇటీవల కురిసిన వర్షం కారణంగానే వాయు కాలుష్యం తగ్గిందని హైకోర్టు పేర్కొంది.

ALSO READ : Snake In Shoe : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్

ముంబయిలో 1065 మంది కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. రసాయన పటాకుల తయారీ, అమ్మకాలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించేందుకు రిటైర్డ్ బ్యూరోక్రాట్‌తో పాటు పర్యావరణ, వాయు కాలుష్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ముంబయిలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది.