Snake In Shoe : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్

Snake Found In School Shoe : షూస్ లాంటివి వేసుకునేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.

Snake In Shoe : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్

Snake In Shoe (Photo : Google)

తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. మీ పిల్లలకు షూస్ వేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఒకటికి రెండు సార్లు షూని చెక్ చేయండి. బాగా విదిలించండి. అందులో ఏమీ లేవు అని కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాతే పిల్లలకు షూస్ తొడగండి. లేదంటే మీ పిల్లల ప్రాణాలకే ప్రమాదం. అసలేం జరిగిందో తెలుసా.. ఓ విద్యార్థి స్కూల్ షూలో పాము కనిపించింది.

వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు వెంకటేశ్వర నగర్‌లో జరిగింది. ప్రదీప్ అనే బాలుడు స్థానిక స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ఇంటి బయట ఉన్న షూ వేసుకోవడానికి వెళ్లాడు. అయితే, షూలో నుంచి ఏదో శబ్దం వినిపించింది. దీంతో ప్రదీప్ భయపడ్డాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్లి గమనించాడు. అంతే, అతడి గుండె ఆగినంత పనైంది. షూలో పాము ఉంది. బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ప్రదీప్ భయపడిపోయాడు. అక్కడి నుంచి పరుగులు తీశాడు.

Also Read : ఆన్‌లైన్‌లో దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఈ ఫేక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్లతో జాగ్రత్త.. సైబర్ పరిశోధకుల హెచ్చరిక!

వెంటనే వెళ్లి తన తండ్రికి సమాచారం అందించాడు. ప్రదీప్ తండ్రి వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. షూలో దాక్కుని ఉన్న పాముని బయటకు తీశాడు. దాన్ని పట్టుకుని డబ్బాలో బంధించాడు. ఆ తర్వాత పామును తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ పాము చాలా పెద్దదిగా ఉంది. పైగా బుసలు కూడా కొడుతోంది. షూలో దాగిన పాముని చూడగానే వామ్మో అంటూ అందరూ బిత్తరపోయారు. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి.

స్కూల్ షూలో పాము కనిపించిన ఘటన కలకలం రేపింది. ప్రదీప్ తల్లిదండ్రులతో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ చూసుకోకుండా బాలుడు షూ వేసుకుని ఉంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదన్నారు. ఎలాంటి అపాయం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’.. అంటే ఏంటి?

కాగా, ఇదొక హెచ్చరిక లాంటిది. షూస్ లాంటివి వేసుకునేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. షూ లోపల ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. షూ ని బాగా విదిలించాలి. అందులో ఏమీ లేదని నిర్ధారించుకున్నాకే వాటిని వేసుకోవాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.