బీజేపీ వ్యూహం ఇదేనా..? పెద్దలేం చెప్పారు : మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామాలు

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 10:33 AM IST
బీజేపీ వ్యూహం ఇదేనా..? పెద్దలేం చెప్పారు : మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామాలు

Updated On : November 26, 2019 / 10:33 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు ఒక్క రోజు ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రాజీనామాలు చేశారు. అజిత్ రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సీఎం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నట్టు మీడియా వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం బుధవారం (నవంబర్ 27, 2019) మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడ్నవీస్ తన మెజార్టీపై బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. 

ఒక్క అడుగు వెనక్కి : అమిత్ షా ఏం చెప్పారు
ఈలోపే సీఎం, డిప్యూటీలు వరుసగా రాజీనామాలు ప్రకటించడంతో బీజేపీ వ్యూహాం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గాలంటే ఒక్క అడుగు బీజేపీ వెనక్కి వేయడంలో అంతరార్థం ఏంటి అనేది పార్టీ వర్గాల్లో నెలకొంది. రాజీనామా ప్రకటనలకు ముందు బీజేపీ పెద్దలతో అత్యవసరం సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హో మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అమిత్ షా.. ఫడ్నవీస్ కు ఏదో సందేశం ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఆయన వ్యక్తిగత నిర్ణయం : ఫడ్నవీస్
ముందుగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా ముందుకు వచ్చిన సీఎం ఫడ్నవీస్ తాను కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో బీజేపీనే అతి పెద్ద పార్టీని, మెజార్టీ ప్రజలు బీజేపీకే అనకూలంగా తీర్పునిచ్చారని అన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ శివసేన సీఎం పదవి కావాలని అడగలేదని, ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ పవరే తమను సంప్రదించినట్టు ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అజిత్ పవార్ తనకు చెప్పినట్టు ఫడ్నీవీస్ తెలిపారు. 

బలపరీక్షలో ఎవరి బలం ఎంత?
నిజానికి నవంబర్ 30వ తేదీ వరకు బలనిరూపణ కోసం ఫడ్నవిస్ ప్రభుత్వానికి గవర్నర్ గడువు ఇచ్చారు. సుప్రీంకోర్టు మాత్రం రేపే (నవంబర్ 27, 2019) బలపరీక్షకు ఆదేశించింది. 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో గెలిచింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. ఇంకా 29మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో అజిత్ పవార్ వర్గం నుంచి ఎంతమంది వస్తారో చూడాలి. 

అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీపీలో రెబెల్స్ అంశం ఆందోళన కలిగిస్తోంది. చివరి నిమిషంలో ఎమ్మెల్యేలు ఎటువైపు దూకుతారోననే శరద్ పవార్ కు టెన్షన్ పట్టుకుంది.