Pakistan: తెలివైన వారంతా పాకిస్థాన్ వదిలి వెళ్లిపోతున్నారు: నివేదికలో సంచలన విషయాలు
దాదాపు 1,50,059 మంది అత్యంత ప్రతిభావంతులు పాక్ విడిచి వెళ్లిపోయారు.

Emigration
Pakistan- Nationals: రాజకీయ, ఆహార, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం.. ప్రస్తుతం ఈ పదాలు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాకిస్థానే. ఉగ్రవాదాన్ని పోషిస్తోన్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు దేశ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు.
దీంతో పాక్ నుంచి తెలివైన, నైపుణ్యాలు ఉన్న యువత ఉద్యోగాన్వేషణలో దేశం విడిచి వెళ్లిపోతున్నారు. నైపుణ్యాలులేని వారు, అత్యుత్తమ ప్రతిభ కనబర్చని వారే పాకిస్థాన్ లో మిగిలిపోతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనంత మంది ప్రతిభావంతులు 2022లో విదేశాలకు ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారని బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ నివేదిక ఆధారంగా పాకిస్థాన్ ఇంగ్లిష్ వార్తా పత్రిక డాన్ వివరాలు తెలిపింది.
గత దశాబ్ద కాలంలో దాదాపు 1,50,059 మంది అత్యంత ప్రతిభావంతులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని వివరించింది. పాకిస్థాన్ నుంచి విదేశాలకు వెళ్లిన కొద్ది పాటి నైపుణ్యాలు ఉన్నవారు మిలియన్లలోనే ఉన్నారు. 2015లో మొత్తం 94 లక్షల మంది ప్రజలు పాక్ నుంచి వెళ్లిపోగా, వారిలో 17,484 మంది అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారే.
పాక్ లో 2022లో మొత్తం 8,32,339 మంది విదేశాలకు వెళ్లగా వారిలో అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారు 17,976 మంది. 2020-21లో మాత్రం కరోనా వేళ ఆంక్షలు ఉండడంతో కేవలం 5,121 మంది మాత్రమే పాకిస్థాన్ వదిలి వెళ్లగలిగారని పేర్కొంది. 1971 నుంచి ఇప్పటివరకు విదేశాలకు వెళ్లిన పాకిస్థానీయులను పరిశీలిస్తే రావల్పిండి నుంచి అత్యధికంగా విదేశాలకు వెళ్తున్నారు.
Manipur : నా కుటుంబం భవిష్యత్తు తెలియడం లేదు.. మొదటిసారి మీడియా ముందుకు మణిపూర్ బాధితురాలి తల్లి