భారత్ ఖాతాలో రెండు బంగారు పతకాలు

అథ్లెటికీ మిటింక్ లో మరో భారత అథ్లెట్ హిమదాస్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల 300 మీటర్ల పరుగులో హిమదాస్ పసిడి పతకం అందుకుంది. గత 45 రోజుల్లో ఆమెకి ఇది ఆరో పసిడి కావడం విశేషం. అలాగే చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటికీ మిటింక్ రైటర్‌లో భారత అథ్లెట్ మహ్మద్ అనాస్ బంగారు పతకం దక్కించుకున్నారు.
పురుషుల 300 మీటర్ల పరుగును 32.41 సెకన్లలో పూర్తిచేసిన మహ్మద్ అనాస్ ఈ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్ నిర్మల్ టామ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్మల్ రేసుని 33.03 సెకన్లలో పూర్తిచేశాడు.
ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అంతకుముందు కుంటో అథ్లెటిక్ మీట్‌లో 200 మీటర్ల పరుగును మహ్మద్ అనాస్ 21.18 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం గెలుచుకున్నాడు.
ముకుందం శర్మ కమిటీ అర్జున అవార్డు కోసం ఎంపిక చేసిన 19మంది అథ్లెట్స్‌లో అనాస్ అవార్డు అందుకున్నాడు. కేంద్ర క్రీడల శాఖ ఆమోదం లభించాక ఆగస్టు 29న(జాతీయ క్రీడల దినోత్సవం) ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.