KBC season 13: చూపు తక్కువ.. కానీ కోటితో పాటు మనసులు గెలుచుకుంది!

విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు.

KBC season 13: చూపు తక్కువ.. కానీ కోటితో పాటు మనసులు గెలుచుకుంది!

Kbc Season 13

Updated On : September 2, 2021 / 12:45 PM IST

KBC season 13: విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా హిందీలో ప్రసారం అవుతోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి దేశ వ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు లక్షల్లో అభిమానులుంటే ఎందరో ఎన్నో ఏళ్లుగా ఈ షోలో అవకాశం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అలా వచ్చిన అవకాశాన్ని వందకు వంద శాతం ఉపయోగించుకున్నారు హిమనీ బుందేలా.

కేబీసీ ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో తాజాగా హిమానీ బుందేలా అనే యువతి పాల్గోని కోటీ రూపాయలు గెలిచుకున్నారు. ఈ సీజన్ లో కోటి గెలుచుకున్న మొదటి విజేత కూడా ఈ యువతే. ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల బుందేలా ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్‌ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె చూపు తగ్గింది. నాలుగు ఆపరేషన్లు చేసినా స్పష్టమైన చూపు తిరిగిపొందలేకపోయారు. అలా దృష్టి లోపంతో పోరాడుతూనే ఈ పోటీలో కరోడ్ పతిగా గెలవడం విశేషం. అందుకే ఆమె కోటి మాత్రమే కాదు దేశంలో ఎందరో మనసులను గెలుచుకున్నారు. ఇంతకీ ఆమెని కరోడ్ పతిని చేసిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటన్నది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకీ హిమానీ బుందేలా రూ.1 కోటి గెలుచుకున్న ఆ ప్రశ్న ఏంటంటే.. బ్రిటిష్ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన తన మారుపేరు ఏంటీ.. ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇవే.. A.వెరా అట్కిన్స్, B.క్రిస్టినా స్కార్‌బెక్, C.జూలియన్ ఐస్నర్, D.జీన్-మేరీ రెనియర్స్. ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన బుందేలా తన సమాధానాన్ని D.జీన్-మేరీ రెనియర్స్ లాక్ చేయించారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అదే కావడంతో హిమనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఒక్కసారిగా కేబీసీ సెట్ లో హర్షధ్వానాలు మార్మ్రోగిపోయాయి.