Assam CM Himantha: మనీశ్ సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తా: అస్సాం సీఎం హిమంతా బిస్వా

అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.

Assam CM Himantha: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా మరియు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిస్వా శర్మ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. ఇద్దరు నేతల వరుస ట్వీట్లతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. పీపీఈ కిట్ల సరఫరా కాంట్రాక్టును సీఎం హిమంతా తన సతీమణి, వారి కుమారుడికి చెందిన పార్టనర్లకు అప్పగించి లబ్ది పొందారని సిసోడియా శుక్రవారం ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సీఎం హిమంతాను టార్గెట్ చేసిన ఆమ్ ఆద్మీ నేతలు ఈ ఆరోపణలు చేయడం పై సీఎం హిమంతా స్పందించారు.

Other Stories: Delhi hospital: ఏడేళ్ల తర్వాత తినడానికి, మాట్లాడటానికి వీలు కల్పించిన సర్జరీ

తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మనీశ్ పై చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తానని సీఎం హిమంతా బిస్వా హెచ్చరించారు. కరోనా తీవ్ర వ్యాప్తిలో ఉన్న సమయంలో తన భార్య భాగస్వామిగా ఉన్న సంస్థ..అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత/స్వచ్చంద సేవ ప్రాతిపదికన పీపీఈ కిట్లను సమకూర్చిందని సీఎం హిమంతా శనివారం ట్వీట్ చేశారు. “అస్సాం ప్రభుత్వం ఇతర కంపెనీల నుంచి ఒక్కొక్కటి రూ.600 చొప్పున పీపీఈ కిట్‌లను కొనుగోలు చేయగా, అప్పటి రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న హిమంతా శర్మ.. తన భార్యకు చెందిన జేసీబీ ఇండస్ట్రీస్‌కు, మెడిటైమ్ హెల్త్‌కేర్‌కు అత్యవసర సరఫరా ఆర్డర్లు ఇచ్చారని సిసోడియా ఆరోపించారు.

Other Stories: Pakistan: ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు.. ఇస్లామాబాద్‌లో హై అల‌ర్ట్

“COVID-19 ఎమర్జెన్సీని ఆసరాగా చేసుకుని” తమ అనునాయులకు చెందిన సంస్థల నుంచి పీపీఈ కిట్లను ఒక్కొక్కటి రూ. 990 చొప్పున కొనుగోలు చేశారన్న సిసోడియా “ఇది అస్సాం ముఖ్యమంత్రి మరియు అతని సన్నిహితులు చేసిన పెద్ద కుంభకోణం”గా ఆరోపించారు. సిసోడియా ఆరోపణలను ఖండించిన సీఎం హిమంతా “కోవిడ్ ఎమర్జెన్సీ టైంలో అస్సాంలో ఒక్క పిపిఇ కిట్ లేని సమయంలో..ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి నా భార్య కొన్ని కిట్‌లను తీసుకురాగలిగిందని” చెప్పారు.

Other Stories: PM Modi: సాయంత్రం ‘లైఫ్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ఆ కిట్లకు సంబంధించి బిల్లులు పెట్టుకోవాలని జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించినప్పటికీ ఆ కంపెనీ ఎటువంటి బిల్లులు లేవనెత్తకుండా, కిట్‌లను ప్రభుత్వానికి స్వచ్చంద సేవ కింద ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క పైసా కూడా లావాదేవీలు జరగనప్పుడు, అవినీతి ఎక్కడ జరిగిందని హిమంతా ప్రశ్నించారు. కాగా, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ నేత సత్యందర్ జైన్ పై ఈడీ విచారణ నేపథ్యంలో ఆపార్టీ నేత మనీశ్ సిసోడియా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంతా బిస్వా శర్మ పై ఆరోపణలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు