తీర్పు రెండు వర్గాల ప్రజలకు ఉపశమనం : పండిట్ శ్రీశ్రీ రవిశంకర్

  • Published By: chvmurthy ,Published On : November 9, 2019 / 07:32 AM IST
తీర్పు రెండు వర్గాల ప్రజలకు ఉపశమనం : పండిట్ శ్రీశ్రీ రవిశంకర్

Updated On : November 9, 2019 / 7:32 AM IST

వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు శనివారం, నవంబర్ 9న, ఇచ్చిన తీర్పను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు పండిట్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ తెలిపారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇరు వర్గాల ప్రజలకు సంతోషం కలుగజేయడంతో పాటు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ఈకేసు చాలా కాలంగా కొనసాగుతోంది.  చివరకు ఒక నిర్ణయానికి చేరుకుంది. దీని ద్వారా సమాజంలో శాంతి సామరస్యాన్ని కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

అయోధ్య భూవివాదంపై కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోవాలన్న సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్‌ సభ్యుడిగా ఉన్నారు.