జనవరి నుంచి పీక్స్‌లోకి పెరగనున్న Honda వాహనాల ధరలు

జనవరి నుంచి పీక్స్‌లోకి పెరగనున్న Honda వాహనాల ధరలు

Updated On : December 20, 2020 / 6:19 PM IST

Honda: జపనీస్ ఆటో మేజర్ కంపెనీ హోండా.. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచాలని కంపెనీ డీలర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇండస్ట్రీ వర్గాలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అన్ని వాహనాలపైనా ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం Honda Amaze ధర రూ.6.17లక్షలుగా ఉండగా.. CR-V ధర రూ.28.71లక్షలుగా ఉంది.

కంపెనీ డీలర్ దీనిని కన్ఫామ్ చేసి కంపెనీ ధరలను హైక్ చేయనున్నట్లు జనవరి నుంచి ఇది కనిపిస్తుందని చెప్పాడు. పెట్టుబడుల విలువ పెరుగుతుండటంతో ఇది తప్పడం లేదని అన్నారు. మోడల్ వైజ్ ధరల పెంపును జనవరిలోగా అందించనున్నారు. కంపెనీ అధికార ప్రతినిధులు విషయంపై స్పందించడం లేదు.

పలువురు ఆటోమేకర్లు ఇప్పటికే తాము పెంచిన ధరలను మోడళ్ల వారీగా పెంచేశారు. గత వారం రెనాల్ట్ ఇండియా ధర కూడా రూ.28వేల వరకూ పెరుగుతుందని తెలిసింది. హోండా కంపెనీ నుంచి వచ్చే క్విడ్, డస్టర్, ట్రైబర్ లాంటి మోడల్స్ ధర జనవరి నుంచి పెరుగుతుందన్నమాట.

ఇతర కంపెనీలు అయిన మారుతీ సుజుకీ, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఆల్రెడీ ధరలు పెంచినట్లు చెప్పేశాయి. వాటిని జనవరి నుంచి అమలు చేస్తామని కూడా చెప్పాయి. పెట్టుబడి విలువలు పెరగడం, ముడి సరుకు, కమొడిటీల ధరలు పెరుగుతుండటమే వీటి మీద ప్రభావం చూపించిందట.

వీటితో పాటు హీరో మోటో కార్ప్ కూడా తమ వాహనాలపై 2021 జనవరి 1 నుంచి ధరలను రూ.1500వరకూ పెంచనున్నట్లు తెలిపింది.