గొంతుకోసి ఉరేయడమే కాదు.. కళ్లు పీకేశాడు

గొంతుకోసి ఉరేయడమే కాదు.. కళ్లు పీకేశాడు

Updated On : February 24, 2020 / 1:48 AM IST

మధ్యప్రదేశ్‌లో 27ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. గొంతుకోసి ఉరేయడంతో పాటు కంటి గుడ్లు పీకి ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు హంతకుడు. వృత్తి రీత్యా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రవి.. మాన్‌పూర్‌లోని సొందియా మొహల్లాలో అద్దెకు ఉంటున్నాడు. 

గ్రామ శివార్లలో చనిపోయి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించగా బయటపడ్డ నిజాలు చూసి షాక్ అయ్యారు. 

ప్రాణం పోయిన తర్వాత మృతదేహం నుంచి కళ్లు పీకేసినట్లు గుర్తించారు. దాంతో పాటు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

మర్డర్ జరిగిన సమయంలో మృతుడి భార్య, ఇద్దరు పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. భార్య బంధువులు, ఆస్తి తగాదాలు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Read More>>కొడుకు ఫోన్ కొట్టేశాడని తండ్రిని పక్కింటోళ్లు చంపేశారు!