KYC Social Media : సోషల్ మీడియా యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు KYC తప్పనిసరి
KYC Social Media : సోషల్ మీడియా, గేమింగ్, డేటింగ్ యాప్ ల వినియోగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
House panel wants KYC made mandatory for social media dating gaming apps
KYC Social Media : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా సాగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి గాను.. కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో దేశంలో పనిచేస్తోన్న అన్ని సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో KYC తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు 2025-26 సంవత్సరానికి సంబంధించిన మహిళా సాధికారతపై కమిటీ నాలుగో నివేదికలో భాగంగా ఉన్నాయి. ఈ నివేదికను సోమవారం లోక్‌సభ, రాజ్యసభల్లో సమర్పించారు.
ఈ నివేదికలో KYCతో పాటు మరికొన్ని కీలకాంశాలను చేర్చారు. వీటిలో ఫోరెన్సిక్ సామర్థ్యం, డీప్‌ఫేక్ నియంత్రణ, అంతర్జాతీయ సహకారం, బాధితుల పునరావాసం వంటి కీలకాంశాలు ఉన్నాయి. అయితే KYC ప్రతిపాదన అనేది అత్యంత ముఖ్యమైనది మాత్రమే కాక ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. నకిలీ ప్రొఫైల్స్, అజ్ఞాతంగా వేధించేవారిని అరికట్టేందుకు అన్ని సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో తప్పనిసరి KYC ధృవీకరణను ప్రవేశపెట్టాలని ఈ నివేదికలో పొందుపరిచారు.
అదేవిధంగా, సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కాలానుగుణంగా తరచుగా రీవెరిఫికేషన్ నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ఈ దుర్వినియోగంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే ఖాతాలను హై-రిస్క్‌గా గుర్తించాలని పేర్కొంది. మహిళలు, చిన్నారులను రక్షించడంలో విఫలమయ్యే ప్లాట్‌ఫారమ్‌లపై శిక్షలు విధించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.
