కొత్త చట్టాలతో ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలిగొంటారు: రాహుల్ గాంధీ

Rahul-gandhi
Rahul gandhi: ఢిల్లీ-హర్యానా బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళనల్లో గడిచిన 17రోజుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కొత్త చట్టాలతో మరెంతమంది ప్రాణాలు కోల్పోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దాంతో పాటు 17రోజుల్లో చనిపోయిన 11మంది రైతుల ఫొటోలను షేర్ చేశారు.
అంతేకాకుండా క్యాబినెట్ మినిష్టర్లు వారిని మావోయిస్టులు, తిరుగుబాటుదారులు అంటూ అభివర్ణించడాన్ని దుయ్యబట్టారు. క్యాబినెట్ మినిష్టర్లు పీయూష్ గోయెల్ ఓ ఇంటర్వ్యూలో లెఫ్టిస్టులు, మావోయిస్టులు ఈ ఆందోళనను నియంత్రిస్తున్నారు. రైతులతో మాట్లాడి చర్చలు పూర్తి చేయకుండా.. మావోయిస్టులుగా తయారయ్యారని విమర్శించారు.
శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా.. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ.. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనపై విమర్శలు గుప్పించారు.
‘నేను కూడా క్యాబినెట్ మినిష్టర్లు ఆందోళనకారులకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు అసంతృప్తిగా ఉన్నా. ఈ గందరగోళ వాతావరణంలో.. అలాంటి స్టేట్‌మెంట్లు ఇండియన్లకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. సెప్టెంబర్ నుంచి రైతులు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది అందరికీ ఉండే హక్కు’ అని పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షలు పర్తాప్ సింగ్ బజ్వా అన్నారు.
వరుసగా చేసిన ట్వీట్లలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సర్జెవాలా.. మోడీ ప్రభుత్వం రైతుల వాదన పట్టించుకోకుండా ఉంటుంది. అన్నదాతలను పట్టించుకోకుండా ధనదాతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మోడీ గారూ.. ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్యం అనే దానికి చోటు లేదు. మీ పాలసీలో ప్రతి వ్యతిరేకిని మావోయిస్టు, తిరుగుబాటుదారుడు అని డిక్లేర్ చేస్తుంది. దానికి క్షమాపణలు అడిగి వారి డిమాండ్లను సమ్మతించండి. వర్షాల్ని, చలిని తట్టుకుని నిలబడుతున్న వారిని పట్టించుకోవాలి’ అని సర్జేవాలా ట్వీట్ లో వెల్లడించారు.