Explosion In Bihar: బీహార్‌లో వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో వ్యాపారి షబీర్ హుస్సేన్‌ ఇంట్లో ఆదివారం ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.

Explosion In Bihar: బీహార్‌లో వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Explosion In Bihar

Updated On : July 24, 2022 / 5:40 PM IST

Explosion In Bihar: బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో వ్యాపారి షబీర్ హుస్సేన్‌ ఇంట్లో ఆదివారం ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని కొంత భాగం దగ్ధం కాగా మిగిలిన భాగం మంటల్లో చిక్కుకుంది.

Monkeys Gang War : గోడలెక్కి మరీ కొట్లాట.. టెన్షన్ పెట్టిన కోతుల గ్యాంగ్ వార్

పేలుడు సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, ఫైరింజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్న అధికారులు వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదాయి బాగ్ గ్రామం జిల్లా కేంద్రమైన ఛప్రా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా పిలిపించామని సరన్ ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు.

వ్యాపారి షబ్బీర్ హుస్సేన్ ఇంట్లో బాణాసంచా వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. పేలుడు జరిగిన ఇంట్లోనే బాణాసంచా తయారు చేశారని, గంటపాటు పేలుళ్ల శబ్ధాలు నిరంతరం వినిపించాయని పోలీసులు తెలిపారు.