OMG : తమిళనాడులో 1,381 కేజీల బంగారం స్వాధీనం

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 03:46 PM IST
OMG : తమిళనాడులో 1,381 కేజీల బంగారం స్వాధీనం

Updated On : April 17, 2019 / 3:46 PM IST

తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తున్నారు.

ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు వాహనాలు తనిఖీ చేయగా.. ఓ వ్యాన్ లో బంగారం పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అని నిందితులు చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు తెలిపారు. పీఎన్‌బీలో టీటీడీ బంగారం ఉందని, మెచ్యూరిటీ ముగియడంతో బంగారంను తీసుకెళ్లాలని పీఎన్‌బీ అధికారులు సూచించారని నిందితులు తెలిపారు.

బ్యాంకు అధికారుల సూచనతో బంగారం తీసుకుని టీటీడీ అధికారులకు అప్పగించేందుకు తిరుపతి వెళ్తున్నామన్నారు. బంగారం టీటీడీది అని చెబుతున్నా.. వారి దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. బ్యాంకు నుంచి తెస్తున్నట్టు డాక్యుమెంట్స్ లేవు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గోల్డ్ ని సీజ్ చేసి భద్రపరిచారు.

దీనిపై ఎన్నికల అధికారులు టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ గోల్డ్ టీటీడీదా కాదా అనే నిజాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కొన్ని గంటల్లో తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద మొత్తంలో గోల్డ్ ని తరలించడం సంచలనంగా మారింది.