భారత్‌లో కరోనా కంటే ఆకలి మరణాలే ఎక్కువ అవుతాయి

  • Publish Date - April 30, 2020 / 09:38 AM IST

కరోనా దెబ్బకు వ్యవస్థలు అన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. రోజురోజుకు లాక్‌డౌన్ కారణంగా ఆకలికి ఇబ్బందులు పడే వ్యక్తులు కూడా ఎక్కువగా అవుతున్నారు. దేశంలో కరోనా భయంతో విధించిన లాక్‌డౌన్‌ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్‌-19 మరణాల కంటే ఆకలి మరణాలే అధికం అవుతాయంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకుంటూనే, పలు సంస్థలను తిరిగి తెరవాలని సూచనలు చేశారు నారాయణ మూర్తి. భారత్‌లో ఏడాదికి దాదాపు 9 మిలియన్ల మంది పలు కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో కాలుష్యం కారణంగా చేనిపోయేవారు 1/4 శాతం మంది అని అన్నారు నారాయణ మూర్తి. ‘దేశంలో ఏడాదికి 90 లక్షల మంది చనిపోతుంటే.. కరోనాతో గత రెండు నెలల్లో సుమారు మంది మాత్రమే చనిపోయారని అన్నారు. ఇదేం పెద్దగా భయపడాల్సిన విషయం కాదన్నారు.

దేశంలో 190 మిలియన్ల మంది భారతీయులు అసంఘటిత, స్వయం ఉపాధి రంగాల్లో పని చేస్తున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, ఇలాగే సాగితే.. చాలామంది జీవనోపాధిని కోల్పోతారని వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని నారాయణ మూర్తి పారిశ్రామికవేత్తలకు సూచనలు చేశారు. భారత్‌లో మరణాల రేటు ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువగా ఉందని ఆయన అన్నారు.