నా భర్తకు ఓటేయొద్దు..బెంగాల్ బీజేపీ అభ్యర్థి భార్య
వెస్ట్ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్‌పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

West Bengal
WEST BENGAL వెస్ట్ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్‌పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఓటేయొద్దని, అతని క్యారెక్టర్ మంచిది కాదని శనివారం మీడియా సమక్షంలో కలియాగంజ్ ప్రజలను కోరారు శర్బరీ.
యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి చాలా డబ్బు దోచుకున్నాడు సౌమిన్. సౌమిన్ కు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉంది. నన్ను, నా కూతుర్ని మోసం చేసి వేరే కాపురం పెట్టాడు. దయచేసి అతనికి ఓటేయొద్దు. ప్రజాప్రతినిధి అయ్యే అర్హత అతనికి లేదు అని శర్బరీ సింఘా రాయ్ మీడియా సమక్షంలో తెలిపారు. సౌమిన్ అక్రమాస్తుల వివరాలను కూడా ఆమె బయటపెట్టారు. కలియాగంజ్ అభ్యర్థిగా సౌమిన్ను తొలగించాలని తాను.. రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులను కోరినట్లు శర్బరీ తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.
ఏ పార్టీకీ తాను మద్దతుగా మాట్లాడటం లేదని..సౌమిన్కు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం నిర్వహిస్తానని శర్బరీ స్పష్టం చేశారు. కలియాగంజ్ భాజపా అభ్యర్థిగా సౌమిన్ రాయ్ పేరును ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. సౌమిన్ రాయ్‌ను తొలగించాలని స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష సైతం చేపట్టారు.