హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్, అంతర్జాతీయ ముఠా అరెస్టు

అంతర్జాతీయ కిడ్నీ బదిలీ రాకెట్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. టర్కీ కేంద్రంగా జరుగుతున్న ఈ కుంభకోణాన్ని పోలీసులకు ఎట్టకేలకు చేధించగలిగారు. గంపరాజు అనే హైదరాబాద్ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయం చేయాలనే ఉధ్దేశ్యంతో పాటు ఆర్థిక అవసరాలు తీరతాయనే ఉద్దేశ్యంతో కిడ్నీ ఇచ్చిన దాతకే హ్యాండ్ ఇవ్వడంతో నిజాలు బయటికి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంపరాజు అనే వ్యక్తి ఫేస్‌బుక్ ప్రకటన చూసి కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసముంటున్న రోహన్ మాలిక్(సందీప్ దక్ష్)ను సంప్రదించాడు. వాట్సప్ ద్వారా మాట్లాడిన మాలిక్ రూ.20లక్షలకు బేరం కుదిర్చాడు. అంతా మేమే చూసుకుంటామని మాటిచ్చాడు.
ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లేందుకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు టిక్కెట్ వేశాడు. జులై 20న ఢిల్లీ చేరుకుని నోయిడాలో ఓ హోటల్ లో దిగాడు. అక్కడ గంపరాజుకు మాలిక్ దగ్గరుండి అన్ని వైద్య పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత పాస్ పోర్ట్‌ను తీసేసుకుని పోలీసుల దగ్గరు్నంచి విదేశాలకు వెళ్లేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పాడు. మళ్లీ ఆ సర్టిఫికేట్ తీసుకుని వారం తర్వాత వెళ్లిన గంపరాజుని సర్జరీ కోసం అన్ని సర్టిఫికేట్లతో తయారుచేశాడు.
టర్కీలో ఆగష్టు 18న జరిగిన సర్జరీ కోసం.. గగన్ అగర్వాల్ అనే మహిళకు గంపరాజులను భార్యభర్తలుగా చిత్రీకరిస్తూ సర్టిఫికేట్లు పుట్టించాడు. డాక్టర్ రితికా జైస్వాల్, కిడ్నీ కావలసిన మహిళ(గగన్ అగర్వాల్)కుటుంబంతో పాటు ఓ ట్రాన్స్‌లేటర్‌ను తీసుకుని టర్కీకి బయల్దేరారు. అక్కడ దిగగానే టర్కీలో ఉంటున్న ఇజ్మీర్, అమ్రీష్ ప్రతాప్ సిసోడియా, డినాలను కలిశారు. వారి సమక్షంలో మరోసారి వైద్య పరీక్షలు చేశారు.
ఆగష్టు 27న సర్జరీ చేస్తామని తెలపడంతో గంపరాజు తనకు ఇస్తానన్న రూ.20లక్షలు ఇవ్వాల్సిందేనని మొండికేశాడు. పాస్ పోర్టుతో సహా వీసా.. అన్నీ లాగేసుకుని కిడ్నీ డొనేట్ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్లేందుకు కుదురుతుందని బెదిరించారు. అతని ఎడమ కిడ్నీని సర్జరీ చేసి గగన్ అగర్వాల్‌కు అమర్చారు.
సర్జరీ చేసిన రితికా జైస్వాల్(రింకీ)ను ఢిల్లీలోని బిదాపూర్ వద్ద అరెస్టు చేశారు. అంతకంటే ముందు కాల్ రికార్డింగ్‌లు, పలు కీలక సమాచారమంతా సేకరించారు. మరో నిందితుడు ప్రతాప్ సిసోడియా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కేంద్రంగా .. మెడికల్ ట్రావెల్ సర్వీసు నిర్వహిస్తున్నాడు. సిసోడియా గతంలోనూ పలు కిడ్నీ రాకెట్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, సింగపూర్, శ్రీలంక, టర్కీ పలు రాష్ట్రాల్లో సిసోడియా నిందితుడిగా ఉన్నాడు.