Mallikarjun Kharge: “ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఎవరు అవుతారు?” వంటి విషయాలపై నేనెన్నడూ మాట్లాడలేదు: ఖర్గే

"విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యం ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకమై ముందుకు వెళ్లాలి. ప్రతిపక్షాలకు ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధాని ఎవరు అవుతారు? అన్న విషయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు అది ఓ సమస్యే కాదు. అందరం కలిసి పోరాడాలి. ఇదే మన కోరిక" అని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

Mallikarjun Kharge: “ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఎవరు అవుతారు?” వంటి విషయాలపై తానెన్నడూ మాట్లాడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. చెన్నైలో డీఎంకే నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పలువురు ప్రతిపక్ష నేతలతో కలిసి పాల్గొని మాట్లాడారు.

“విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యం ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకమై ముందుకు వెళ్లాలి. ప్రతిపక్షాలకు ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధాని ఎవరు అవుతారు? అన్న విషయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు అది ఓ సమస్యే కాదు. అందరం కలిసి పోరాడాలి. ఇదే మన కోరిక.

తమిళనాడులోని కాంగ్రెస్-డీఎంకే కూటమి 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 2006, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. మన కూటమిని మరింత బలపర్చాలి. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పునాదులు వేయాలి” అని మల్లికార్జున ఖర్గే చెప్పారు.

కాగా, అంతకుముందు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ… “స్టాలిన్ తమిళనాడును ఎలా ఏకం చేశారో ఇప్పుడు దేశంలో కూడా అలాంటి పాత్రను పోషించాల్సి ఉంది. మల్లికార్జున ఖర్గే జీ… ఎవరు ప్రధాన మంత్రి అవుతారన్న విషయాన్ని మర్చిపోవాలి. మొదట ఎన్నికలు గెలవాలి. ఆ తర్వాత ఎవరు ప్రధాని అవుతారన్న విషయం గురించి ఆలోచించాలి. ప్రధాని ఎవరవుతారన్నది ముఖ్యమైన విషయం కాదు.. దేశ సంక్షేమమే ముఖ్య విషయం” అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గే “ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఎవరు అవుతారు?” వంటి విషయాలపై తానెన్నడూ ప్రకటనలు చేయలేదని అన్నారు.

Delhi CM Kejriwal: నేడు సిసోడియా బీజేపీలో చేరితే.. రేపు జైలు నుంచి విడుదల అవుతారు కదా?: కేజ్రీవాల్

ట్రెండింగ్ వార్తలు