Honeytrap: హనీ ట్రాప్‌లో భారత వైమానిక దళ జవాన్.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద నగదు..

గూఢచర్యం భారత్‌కు శత్రుదేశాల నుంచి హాని కలిగించే ఆయుధంగా మారుతోంది. దీనికోసం కొన్ని దేశాలు హనీ ట్రాప్ ద్వారా సైనికులను టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా భద్రతా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని...

Honeytrap: గూఢచర్యం భారత్‌కు శత్రుదేశాల నుంచి హాని కలిగించే ఆయుధంగా మారుతోంది. దీనికోసం కొన్ని దేశాలు హనీ ట్రాప్ ద్వారా సైనికులను టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా భద్రతా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని బయటకు తీయడంలో సఫలీకృతులవుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అలాంటి ఓ కేసును చేధించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్‌గా పనిచేస్తున్న దేవేంద్ర శర్మ హనీ ట్రాప్ వలలో చిక్కుకోవడం ద్వారా అతని నుంచి భారత వైమానిక దళానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..

హనీ ట్రాప్‌లో చిక్కుకున్న దేవేంద్రశర్మ నుంచి ఉన్నతాధికారుల పేర్లు, చిరునామాలు అడగడంతో పాటు ఎన్ని ఏఐఎఫ్ లొకేషన్లు, రాడార్లు సమాచారాన్ని రాబట్టినట్లు పోలీస్ వర్గాల నుంచి అందిన సమాచారం. దీనివల్ల భవిష్యత్తులో దేశానికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు నిందితుడు దేవేంద్ర శర్మను మే 6న అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కు చెందిన వాసి దేవన్‌సర్ శర్మ. ఓ మహిళా ప్రొఫైల్‌తో ఫేస్‌బుక్‌లో స్నేహితుడయ్యాడని చెబుతున్నారు. ఆ తర్వాత దేవేంద్ర శర్మను ఫోన్ లో సెక్స్ ద్వారా ట్రాప్‌లోకి తీసుకున్నారని, అతడి నుండి రహస్య సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..

ఆ మహిళ దేవేంద్ర శర్మతో మాట్లాడిన ఫోన్ నెంబర్ ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్ నంబర్. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ డియాక్టివేట్ అయిందని, మహిళను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ అందిన సమాచారం మేరకు నిందితుడి భార్య బ్యాంకు ఖాతాలో కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దేవేంద్ర శర్మ క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్నారు. దేవేంద్ర శర్మ అందజేసిన సమాచారం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరం రుజువైతే కఠినమైన అధికారిక రహస్యాల చట్టం ప్రకారం శర్మకు మూడేళ్ల జైలు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు