Assam CM : విద్యార్థినిలు హిజాబ్‌ ధరిస్తే..వారికి పాఠాలు అర్థమయ్యాయో లేదో టీచర్ కి ఎలా తెలుస్తుంది?

క్లాసురూముల్లో విద్యార్థినిలు హిజాబ్‌ ధరిస్తే..వారికి పాఠాలు అర్థమయ్యాయో లేదో టీచర్ కి ఎలా తెలుస్తుంది? అని విచిత్రమైన లాజిక్ తెచ్చారు అస్సాం సీఎం.

Assam CM Himanta Biswa Sharma : క్లాస్ రూముల్లో విద్యార్థినిలు హిజాబ్‌ ధరించి కాలేజీలకు వస్తే వారికి పాఠాలు అర్థమయ్యాయో లేదో టాచర్ కి ఎలా తెలుస్తుంది? అని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ విచిత్రమైన లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం హిమంత బిస్వా..హిజాబ్ ఎందుకు అవసరం లేదు అనే అంశంపై వివరణ ఇస్తూ..ఈ కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చారు. విద్యార్థినులు క్లాస్‌లో హిజాబ్‌ ధరిస్తామని మూడేండ్ల కిందట ఎవరూ అనలేదన్నారు. ముస్లిం సమాజానికి విద్యే అవసరమని, హిజాబ్‌ కాదు అని అన్నారు. హిజాబ్ ధరించటం వల్ల విద్యార్థినులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రయోజనం కలిగించే విద్య ముఖ్యం కానీ..హిజాబ్ కాదని అన్నారు.

Also read :  Hijab Row: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్‌ అంశంపై చర్చ జరుగుతున్నది. ముస్లిం విద్యార్థినులు క్లాస్‌లో హిజాబ్‌ ధరించడాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కొత్త లాజిక్‌ను తెరపైకి తెచ్చారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించినట్లయితే, పాఠం అర్థమైందా లేదా అన్నది ఉపాధ్యాయులకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. దీన్ని రాజకీయం చేసి విద్యార్ధులకు విద్యకు దూరం చేస్తున్నారని ఇప్పటికైనా ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని అన్నారు.

కాగా..కర్ణాటక హిజాబ్ ఘటనతో అట్టుడుకుతోంది. ఇది కేవలం కర్ణాటకే పరిమితంకాకుండా దేశమంతా వివాదంగా మారింది.ఈ వివాదానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని సీఎం హిమంత బిస్వా శర్మ ఆరోపించారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న తీరు ఆందోళనకరమన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దడంపై కృషి చేస్తుంటే..ఇతరులు మాత్రం హిజాబ్‌ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also read :  Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

ట్రెండింగ్ వార్తలు