House Helps Survey: ఇంటి పనుల్లో భర్త పాలు పంచుకుంటే దాంపత్యం ధృఢంగా ఉంటుందట

కుటుంబ సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సర్వే సహాయపడింది. ఇంటి పనులు 'అతడు' లేదా 'ఆమె' ఉద్యోగం కాదు. అది ఇద్దరి బాధ్యత. పని పంచుకోవడం ద్వారా భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు.

House Helps Survey: ఇంటి పనుల్లో భర్త పాలు పంచుకుంటే దాంపత్యం ధృఢంగా ఉంటుందట

Updated On : June 6, 2023 / 7:49 PM IST

Neha Dhupia: ఇంటి పనుల్లో భర్త సాయం చేస్తే దాంపత్యం బలంగా ఉంటుందని, కుటుంబం సంతోషంగా ఉంటుందని ఒక సర్వేలో తేలింది. ఇంట్లో సమానత్వం, అసమానత్వం అనే అంశాలపై బాలీవుడ్ నటి నేహా దూపియా సహా 100 మంది హౌస్ హెల్ప్స్ అనే పేరుతో సర్వే చేశారు. ఈ సర్వేలో 95 శాతం మంది ఇంటి పనుల్లో భర్త పాలు పంచుకుంటే దాంపత్యం ధృఢంగా ఉంటుందని వెల్లడించారు. ఇక భార్యాభర్తలు ఇంటిపనులను సమానంగా విభజించుకోనప్పుడు, వివాహబంధంలో దూరం ఏర్పడుతుందని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. భర్తలు ఇంటి పనుల్లో సహాయం చేయనప్పుడు దంపతుల మధ్య సంభాషణ తగ్గిపోతుందని 85% కంటే ఎక్కువ మంది వెల్లడించారు.

Japan Movie : రియల్ స్టోరీతో కార్తీ ‘జపాన్’.. కోట్ల విలువ చేసే బంగారం కొట్టేసి ఎయిడ్స్‌తో చనిపోయిన దొంగ..

ఈ విషయమై నటి నేహా ధూపియా మాట్లాడుతూ “కుటుంబ సంబంధాలు కాలక్రమేణా ఎలా మారతాయో తెలుసుకోవటానికి హౌస్ హెల్ప్స్ సర్వే సహాయపడింది. ఇంటి పనులు ‘అతడు’ లేదా ‘ఆమె’ ఉద్యోగం కాదు. అది ఇద్దరి బాధ్యత. పని పంచుకోవడం ద్వారా భర్తలు తమ భార్యలపై భారాన్ని తగ్గించవచ్చు. అలాగే తమ బంధాన్ని బలోపేతం చేయవచ్చు. అసమానత కొనసాగితే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టించవచ్చు” అని అన్నారు.

Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని