Allahabad HC : మైనర్లు సహజీవనం చేయటం చట్టవిరుద్ధం, అనైతికం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వివాహం చేసుకుకోకుండా కలిసి ఉండే ఈ పాశ్చత్య పోకడలు దేశంలో కోర్టులకెక్కుతున్నాయి. సహజీనవం చేసేవారు విభేధాలు వచ్చి విడిపోతే వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారి బంధాల గురించి విడిపోవటం గురించి కోర్టులు విభిన్న తీర్పులనిస్తున్నాయి

Minor Live-In Relationship
Allahabad High Court Minor Live-In Relationship : భారతదేశంలో గత కొంతకాలం నుంచి సహజీవనం (In Live-In Relationship) అనే సంస్కృతి పెరుగుతోంది. వివాహం చేసుకుకోకుండా కలిసి ఉండే ఈ పాశ్చత్య పోకడలు దేశంలో కోర్టులకెక్కుతున్నాయి. సహజీవనం పేరుతో వివాహేతన సంబంధాలకు కారణమవుతోందనే అభిప్రాయాలు వెల్లడవుతోంది. సహజీనవం చేసేవారు విభేధాలు వచ్చి విడిపోతే వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారి బంధాల గురించి విడిపోవటం గురించి కోర్టులు (Courts) విభిన్న తీర్పులనిస్తున్నాయి.
ఈక్రమంలో మైనర్ల సహజీవనంపై అలహాబాద్ కోర్టు (Allahabad High Court) కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లు చేసే సహజీవనం (Minor In Live-In Relationship)అనైకమని తేల్చి చెప్పింది. సహజీవనం చేయాలంటే 18 ఏళ్లు దాటి ఉండాలని తేల్చి చెప్పింది.సహజీవనం చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండాలని స్పష్టం చేసింది. 18 ఏళ్ల లోపు వారి సహజీవనాన్ని అనైతికమని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి 17 ఏళ్ల యువకుడితో ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తోంది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వెతికి పట్టుకునితమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం తమ కూతురుని సదరు యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడంటూ కేసు పెట్టారు. ఈక్రమంలో సదరు యువతి ఇంటి నుంచి మరోసారి తప్పించుకుని వెళ్లిపోయింది. సరాసరి సదరు యువకుడిపై తమ తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారని అతని తండ్రికి చెప్పింది.
ఆ తరువాత కోర్టును ఆశ్రయించింది. తాను ఇష్టపూర్వకంగానే సదరు యువకుడితో కలిసి ఉంటున్నానని..అతడిపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరింది. అతడిని అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించిది. దీనిపై విచారించిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. మేజర్ అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నంత మాత్రాన మైనర్ అబ్బాయి నేర విచారణ నుంచి రక్షణ కోరలేడని..అతడి చర్యలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వారిని పిల్లలుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. వారి సహజీవనాన్ని అనుమతిస్తే చట్టవిరుద్ధమైన చర్యకు అంగీకారం తెలిపినట్టు అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.