మన భారతీయులను విమానంలో ఎంత ఘోరాతి ఘోరంగా హింసించారో తెలుసా? వారి మాటల్లోనే..

భయానక అనుభవాన్ని వివరించారు.

మన భారతీయులను విమానంలో ఎంత ఘోరాతి ఘోరంగా హింసించారో తెలుసా? వారి మాటల్లోనే..

Updated On : February 18, 2025 / 5:06 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అక్రమ వలసదారుల విషయంలో తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే దశలవారీగా మూడు విమానాల్లో భారతీయులు భారత్‌కు వచ్చారు. అక్రమ వలసదారులను తరలించే సమయంలో అమెరికా అధికారులు వారి కాళ్లు, చేతులను చైన్‌తో కట్టేసిన ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి.

అయితే, అధికారులు అంతకంటే దారుణంగా, మానవ హక్కుల ఉల్లంఘన స్థాయిలో వ్యవహరించినట్లు తెలుస్తోంది. తమను మతపర వివక్షను గురిచేస్తూ, మానసికంగా హింసించారని కొందరు చెప్పారు.

అమెరికా నుంచి 112 మంది అక్రమ వలసదారులతో మూడో విమానం ఆదివారం అమృత్సర్‌లోని గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి వచ్చిన కొందరు మీడియాకు పలు విషయాలు తెలిపారు.

Also Read: ఇందిరమ్మ ఇల్లు వస్తుందా? రాదా? అని ఆలోచిస్తున్నారా? జాబితాలో మీ పేరు లేదా? ఇలా ఫిర్యాదు చేయండి..

జతైందర్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. నిర్బంధ శిబిరంలో రెండు వారాలు గడిపానని అన్నారు. తనను మానసికంగా హింసించారని, తనకు సరైన ఆహారం కూడా ఇవ్వలేదని తెలిపారు.

అమెరికా సైన్యం తన తలపాగా ను తీసివేయాలని బలవంతం చేసిందని అన్నారు. తలపాగాను తీసేసి డస్ట్‌బిన్‌లో విసిరేశారని చెప్పారు. అమెరికా సైనిక విమానంలో తనను సుమారు 36 గంటలు సంకెళ్లతో ఉంచారని ఆయన ఆరోపించారు. అమెరికా అధికారులు తనకు లే చిప్స్, ఫ్రూటీని రోజుకు రెండుసార్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.

తాము పవిత్రంగా భావించే తలపాగాతో పాటు తన బట్టలన్నింటినీ తొలగించాలని చెప్పారని అన్నారు. నిర్బంధ కేంద్రంలో మానసికంగా హింసించారని తెలిపారు. సిక్కు యువకులు తమ టర్బన్‌లను తిరిగి ఇవ్వాలని కోరారని, అధికారులు నిరాకరించారని అన్నారు.