Indiramma Houses: ఇందిరమ్మ ఇల్లు వస్తుందా? రాదా? అని ఆలోచిస్తున్నారా? జాబితాలో మీ పేరు లేదా? ఇలా ఫిర్యాదు చేయండి..
మీ సమస్యను అక్కడ తెలపండి

Indiramma indlu
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం పేద ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. అర్హులను తేల్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేసి, వారి పేర్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
దరఖాస్తు చేసుకున్న వారిని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా విభజించింది. అయితే, వాటిలో పేర్లు లేని వారు, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. దానికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. లిస్ట్ 1లో ఉన్నవారికి ముందుగా ప్రభుత్వం ఇళ్లు ఇస్తుందని భావిస్తున్నారు.
Also Read: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రోత్సాహకాలు..
మీరు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసి, మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్ సైట్ ద్వారా కూడా సర్కారుకి తెలియజేయొచ్చు. అలాగే. జిల్లా కలెక్టర్ ఆఫీసులోనూ ఫిర్యాదు చేయవచ్చు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.
లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో మీ పేరు ఉంటే, వాటిపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఈ కింది విధంగా అధికారులకు ఆన్‌లైన్‌లో తెలియజేయండి
- https://indirammaindlu.telangana.gov.in/applicantSearch ఓపెన్ చేయాలి
- మీ ఆధార్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డు/ అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి
- గో పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు, సర్వే వివరాలు వస్తాయి
- మీ దరఖాస్తు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఎందులో ఉందో కింద కనపడుతుంది
- అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే Click here to raise grievance పై క్లిక్ చేయండి
- మీ సమస్యను అందులో తెలపండి
కాగా, ఇందిరమ్మ ఇళ్లను పేదలకు, ప్రత్యేకంగా పేద కుటుంబాలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం అందిస్తుంది. అర్హత కలిగిన వారికి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. పేదవారు సొంత ఇంటిని పొంది ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద త్వరలోనే ఇళ్లు వచ్చే అవకాశం ఉంది.