Good News to Farmers: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రోత్సాహకాలు..
రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తుమ్మల అన్నారు.

Thummala Nageswara Rao
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలపై ఆయన చర్చించారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ సౌకర్యాలు.. ప్రభుత్వ సహాయ సహకారాలపై సమీక్ష జరిపారు.
Also Read: అమెరికా గోల్డ్ మాయం.. కదిలిన ఎలాన్ మస్క్.. ఏం జరుగుతుందో తెలుసా?
రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలోని ఆయిల్ పామ్ ప్రగతితో పాటు ఆయిల్ ఫెడ్ కార్పొ రేషన్ ద్వారా కర్మాగారాల ఏర్పాటుపై ఆయన చర్చలు జరిపారు. వాటితో పాటు తోట, ఉద్యాన పంటలు, వెజిటేబుల్స్, సాగు విస్తీర్ణం పెంచే దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తపై పలు సూచనలు చేశారు.