CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. శనివారం రాత్రి నుంచి స్టాలిన్(CM Stalin) కు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు.

CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..

Stalin

Updated On : June 20, 2022 / 3:17 PM IST

CM Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. శనివారం రాత్రి నుంచి స్టాలిన్ కు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ విషయాన్ని మంత్రి దురైమురుగన్ వెల్లడించారు. సీఎం స్టాలిన్‌ సోమవారం వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది.

అస్వస్థత కారణంగా పర్యటనను రద్దు చేశారు. అయితే మళ్లీ పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి స్టాలిన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.