Shocking Video: ఉన్నట్టుండి గూడ్స్ రైలు కింద పడ్డ రైల్వే పోలీస్ కానిస్టేబుల్: అక్కడిక్కడే మృతి

రింగేల్ సింగ్ చేతిలో లాఠీ పట్టుకుని ఉండగా.. చేయి అమాంతం గాల్లోకి లేచి..అతని శరీరం గింగిరాలు తిప్పుతూ గూడ్స్ రైలు కింద పడ్డాడు

Constable

Shocking Video: రైల్వే ప్లాటుఫార్మ్ పై విధుల్లో ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఉన్నట్టుండి గింగిరాలు తిరుగుతూ.. కదులుతున్న గూడ్స్ రైలు కిందపడి మృతి చెందిన దిగ్భ్రాంతికర ఘటన ఆగ్రాలోని రాజా మండి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..రింగేల్ సింగ్ అనే వ్యక్తి గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్ కు డెప్యూటేషన్ పై వచ్చిన రింగేల్ సింగ్..మార్చి 27న స్టేషన్ లోని ప్లాట్ ఫార్మ్ నెంబర్ ఒకటిపై విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ప్లాట్ ఫారం ఒకటిపై నుంచి గూడ్స్ రైలు వెళుతుంది.

Also read:Punjab : క్యూలో నిలబడాల్సినవసరం లేదు..ఇంటి వద్దకే రేషన్, సీఎం సంచలన నిర్ణయం

అయితే ఏమైందో తెలియదుగాని.. రింగేల్ సింగ్ ఉన్నట్టుండి గింగిరాలు తిరుగుతూ ఒక్కసారిగా కదులుతున్న గూడ్స్ రైలు కింద పడ్డాడు. రింగేల్ సింగ్ రైలు కింద పడిన వెంటనే ప్లాట్ ఫార్మ్ పైనున్న ఒక వ్యక్తి రక్షించేందుకు వచ్చినా అప్పటికే అతని శరీరం ముక్కలుగా చీలిపోయింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన తాలూకు దృశ్యాలు స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రింగేల్ సింగ్ చేతిలో లాఠీ పట్టుకుని ఉండగా.. చేయి అమాంతం గాల్లోకి లేచి..అతని శరీరం గింగిరాలు తిప్పుతూ గూడ్స్ రైలు కింద పడ్డాడు.

Also read:Anand Mahindra: కాకులని చూపించి టీం వర్క్ గురించి చెప్తున్న మహీంద్రా