Anand Mahindra: కాకులని చూపించి టీం వర్క్ గురించి చెప్తున్న మహీంద్రా
సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా టీం వర్క్ గురించి చెప్తూ మరో వీడియో పోస్టు చేశారు.

Anand Mahindra
Anand Mahindra: సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా టీం వర్క్ గురించి చెప్తూ మరో వీడియో పోస్టు చేశారు. రెండు కాకులు కలిసి పిల్లిని ఎలా బురిడీ కొట్టించాయో వీడియోలో కనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను పోస్టు చేస్తూ టీం వర్క్ ఎప్పుడూ మిమ్మల్ని మరింత ప్రభావవంతంగా ఉంచుతుందని పోస్టు పెట్టారు.
ఈ వీడియోలో ఏదో తెల్లని వస్తువును పిల్లి తింటుండగా వెనుక నుంచి ఒక కాకి వచ్చి పొడిచింది. వెంటనే వెనక్కు తిరిగిన పిల్లి తరుముతున్నట్లుగా ముందుకెళ్లి కాకిని బెదిరించబోయింది. ఈ లోపు మరో వైపు నుంచి వచ్చిన కాకి ఆ తెల్ల పదార్థాన్ని తీసుకుని వెళ్లిపోయింది. సోమవారం ఉదయాన్నే వీడియోను పోస్టు చేస్తూ.. #MondayMorning పేరుతో ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్‌లో ఉన్న టీం వర్క్ ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తూ ఓ గంట తర్వాత మరో ట్వీట్ పోస్టు చేశారు. ‘రేసింగ్ కార్ విడి భాగాలను ఒక టీం క్షణాల్లో మార్చేయడం వీడియోలో కనిపిస్తుండగా.. మీ టీం మెంబర్ల గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ విజయం మీదవుతుంది’ అని పోస్టు పెట్టారు.
Read Also : మహీంద్రా మెగా ఆఫర్లు.. SUV కార్లపై రూ.3 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు..!