పబ్‌జీతో సహా 47 చైనా యాప్‌లపై నిషేధం!

  • Published By: vamsi ,Published On : July 27, 2020 / 11:56 AM IST
పబ్‌జీతో సహా 47 చైనా యాప్‌లపై నిషేధం!

Updated On : July 27, 2020 / 12:36 PM IST

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావరణం మొదలైన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓవైపు చ‌ర్చ‌లు, మ‌రోవైపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కనిపిస్తుంది. అందులో భాగంగానే చైనాపై డిజిట‌ల్ ఉద్య‌మానికి తెర‌లేపిన భార‌త్.. ఏకంగా ఆ దేశానికి చెందిన 59 సోష‌ల్ మీడియా యాప్స్‌పై ఇప్పటికే నిషేధం విధించింది.

ఇప్పుడు లేటెస్ట్‌గా మరికొన్ని మొబైల్ యాప్‌ల‌ను బ్యాన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది కేంద్ర ఐటీ శాఖ. ముఖ్యంగా చైనాతో సంబంధ‌మున్న మొబైల్ అప్లికేష‌న్ల‌పై గురిపెట్టినట్లుగా ఉన్నతవర్గాల సమాచారం. ఇందులో పబ్‌జీతో సహా హ‌లా లైట్‌, షేరిట్ లైట్‌, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ వంటి యాప్‌ల‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి తొల‌గించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

మొత్తం 47 ప్రమాదకరమైన యాప్‌లను వెంటనే తొలగించాలని కేంద్రం భావిస్తుంది. ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో సాధారణ ఆటల మాదిరిగా ఉన్నా కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, వ్యసనంగా మారి హానికరంగా మారుతున్నాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నాయి. అంతేకాదు మరో రెండు వంద యాప్‌లపై నిఘా పెట్టింది కేంద్రం.

సమాచార మార్పిడి జరుగుతుంది అని గుర్తించిన ఐటీశాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. చైనా యాప్స్‌పై ఇది మరో సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణిస్తున్నారు.