India Bans All Imports From Pakistan
India bans imports from Pakistan: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ను ఇరుకునపెట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపైనా భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతోపాటు తదితర కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి దిగుమతులన్నింటినీ నిషేదించింది. జాతీయ భద్రత, ప్రజా విధానాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిసింది. పాకిస్థాన్ నుంచి రవాణా చేయబడే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేదం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్.. పీవోకేలో ప్రజలకు కీలక ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని, ఈ నిషేధం ఆజ్ఞల నుంచి మినహాయింపు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం అని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలాఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా -అట్టారి సరిహద్దు ఇప్పటికే మూసివేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నుంచి ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజలు భారతదేశానికి దిగుమతి అవుతాయి. 2019 పుల్వామా దాడి తరువాత భారతదేశం పాకిస్థాన్ ఉత్పత్తులపై 200శాతం సుంకం విధించడంతో దిగుమతులు తగ్గిపోయాయి. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
Also Read: Baba Vanga Prediction: ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా? వంగ బాబా జోస్యం ఏం చెబుతోంది..
పాకిస్తాన్ భారతదేశానికి ఎగుమతి చేసే కీలక ఉత్పత్తులు..
♦ పాకిస్థాన్ నుంచి భారతదేశానికి ఎగుమతుల్లో సిమెంట్ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, రాజస్థాన్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ సిమెంట్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
♦ భారతదేశం వస్త్ర కేంద్రంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ నుంచి కొంత మొత్తంలో వస్త్ర ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ముఖ్యంగా ముడి పత్తి, పత్తి నూలు, పట్టు వ్యర్థాలు ఉన్నాయి.
♦ పాకిస్థాన్ నుంచి వివిధ రకాల పండ్లు, ఆహార పదార్థాలు దిగుమతి అవుతుంటాయి. వాటిలో ఖర్జూరాలు, మామిడి పండ్లు ఉన్నాయి. భారత్ లో కొరత ఉన్న సందర్భాల్లో ఉల్లిపాయలు, టమోటాలు కూడా పాకిస్థాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి.
♦ రాతి ఉప్పు, జిప్సం, టాన్డ్ తోలు, ఔషదాలలో ఉపయోగించే కాల్షియం కార్బోనేట్, పలు రసాయన ఉత్పత్తులను పాకిస్థాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది.
♦ క్రికెట్ బ్యాట్లు, బంతులు, చేతి తొడుగులతోపాటు.. శస్త్రచికిత్సా పరికరాలు, కళ్లద్దాల లెన్సులు కూడా దిగుమతి అవుతుంటాయి.