Baba Vanga Prediction: ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా? వంగ బాబా జోస్యం ఏం చెబుతోంది..
ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగా చెప్పిన భవిష్య వాణి ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

Baba Vanga Prediction: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగుతుందా? వంగ బాబా ప్రిడిక్షన్ నిజమేనా? 2025లో భారత్ ఉగ్రవాదంపై యుద్ధం చేస్తుందన్న ఆమె.. ఇండో పాక్ వార్ పై ఏమని అంచనా వేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఆమె ముందే ఊహించ ఉండటంతో ఇండో పాక్ వార్ అంశంపైనా వంగ బాబా ఏం చెప్పారో తెలుకోవాలని ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి వంగ బాబా ఏం చెప్పారు?
ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్న తరుణంలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. రానున్న రోజుల్లో యుద్ధం జరగవచ్చన్న సంకేతాలు సైతం ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్, పాక్ మధ్య 2025లో ఉద్రిక్తతలు పెరుగుతాయని బాబా వంగ అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదంపై భారత్ దాడులు చేయొచ్చని, పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెబుతుందని అంటున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోదని ఆమె స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాదికి సంబంధించి బాబా వంగా చెప్పిన భవిష్య వాణి ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. ఆమె ప్రస్తావించిన అంశాల్లో యూరప్ లో ఓ భారీ యుద్ధం చెలరేగే అవకాశం ఉందని, అది మానవాళికి పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పారు. ఒక రకంగా మానవ జాతి పతనానికి నాంది కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆమె చెప్పినట్లు 2025లో ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక మాంద్యంను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తూ ఉండటం ఇందుకు సంకేతంగా భావించవొచ్చు. ఇదే కాకుండా భూకంపాలు, ప్రకృతి విపత్తులు కూడా 2025లో భారీగా వస్తాయని ఆమె హెచ్చరించారు. మియన్మార్, థాయిలాండ్ లో వచ్చిన భారీ భూకంపం ఈ అంచనాలకు ఉదాహరణగా నిలుస్తోంది.