Hijab Row: మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూర్చకండి: హిజాబ్ పై విదేశాంగశాఖ వివరణ

హిజాబ్ వివాదమైన, మరే ఇతర జాతీయ వివాదమైన అది తమ దేశ అంతర్గత విషయమని..దయచేసి ఇందులో ఎవరు తల దూర్చవద్దని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.

Hijab Row: కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ వివాదం దేశవిదేశాల్లో చర్చకు దారితీసింది. “భారత్ లో ముసుగు ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినిలను అడ్డుకుంటున్నారు” అంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై విదేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిజాబ్ ధరించడం ముస్లిం యువతుల హక్కు అంటూ కొందరు వాదిస్తుంటే..విద్యాసంస్థల్లో మతాచారాలు ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదంపై అమెరికా రాయభారి రషద్ హుస్సేన్ స్పందిస్తూ “పాఠశాలల్లో హిజాబ్ నిషేధం భారత్ లో మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది”అని ట్వీట్ చేశారు.

Also read: Cellphone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఇకపై చట్టబద్ధం: నితిన్ గడ్కరీ

ఇక వివిధ దేశాల నుంచి వెలువడుతున్న భిన్నాభిప్రాయాలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. హిజాబ్ వివాదమైన, మరే ఇతర జాతీయ వివాదమైన అది తమ దేశ అంతర్గత విషయమని..దయచేసి ఇందులో ఎవరు తల దూర్చవద్దని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. ఈమేరకు అరిందమ్ బాగ్చి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిజాబ్ వివాదం ప్రస్తుతం కర్ణాటక హై కోర్టు పరిధిలో ఉందని, దయచేసి కోర్టు తీర్పు వెలువడే వరకు దీనిపై తాము స్పందించలేమని పేర్కొన్నారు.

Also read: Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా చట్టబద్ధతో ఎలా సమస్యలు పరిష్కరించుకుంటున్నామో ఈ వివాదాన్ని సైతం అలాగే పరిష్కరించుకుంటామని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. భారత్ గురించి పూర్తిగా తెలుసుకున్నవారు వాస్తవాలను గ్రహించి ప్రశంసిస్తుంటారని, మిత్ర దేశాలు సైతం వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు