India Laser Weapon: ఇండియా లేజర్ వెపన్స్ రెడీ.. ఇక స్టార్ వార్స్..!
సురక్షితమైన, వేగవంతమైన యాంటీ డ్రోన్ వ్యవస్థ మన వద్ద ఉంటుంది.

లేజర్ ఆయుధ టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే విషయంలో భారత్ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ సాంకేతికతో డ్రోన్లు, శత్రు దేశాల క్షిపణులను ధ్వంసం చేసే వ్యవస్థను భారత్ పరీక్షించగా, ఈ ప్రయోగం విజయవంతమైంది.
లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్య్లూ)ఎంకే -II(ఏ)ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఏప్రిల్ 13న కర్నూలు సమీపంలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో జరిగింది. డ్రోన్లు, మిసైల్స్ వంటి లక్ష్యాలను లేజర్ కిరణాలతో ధ్వంసం చేసే సామర్థ్యం ఈ ఆయుధానికి ఉంది.
Also Read: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సు చేసిన యువకుడు
ఈ ప్రయోగం ద్వారా అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ వంటి లేజర్ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా వద్ద ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఉండగా, ఇజ్రాయెల్‌లో ప్రయోగాల దశలో ఉంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ ఆయుధం UAVలను 4–5 కిలోమీటర్ల దూరం నుంచే ఛేదిస్తుంది. 2019 నుంచే ఈ టెక్నాలజీపై భారత్ ప్రయోగాలు చేస్తోంది.
డీఆర్డీవో ఇప్పుడు 300 కిలోవాట్ సామర్థ్యం కలిగిన, 20 కిలోమీటర్ల పరిధి గల హై పవర్ లేజర్ వెపన్ తయారీపై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో దీనిని వాయు, జల మార్గాల్లో ఉపయోగించే విధంగా అభివృద్ధి చేస్తోంది.
ఈ టెక్నాలజీ వల్ల శత్రుదేశాల సర్వైలెన్స్ సెన్సర్లు పనిచేయకుండా చేసే సామర్థ్యం కూడా మనకు ఉంటుంది. సురక్షితమైన, వేగవంతమైన యాంటీ డ్రోన్ వ్యవస్థ మన వద్ద ఉంటుంది. భారత రక్షణ రంగానికి ఇది ఒక కీలక ఘట్టంగా నిలిచింది.
ప్రస్తుతం డ్రోన్లను యుద్ధాల్లో ఏ మేరకు వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాటిని ధ్వంసం చేసేందుకు కొత్త వ్యవస్థ అవసరం ఉంటుంది. దేశ రక్షణ వ్యవస్థకు ఇలాంటి లేజర్ ఆయుధాలు కీలకంగా మారబోతున్నాయి.
#WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4
— ANI (@ANI) April 13, 2025