భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2019 / 11:37 AM IST
భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

Updated On : March 19, 2019 / 11:37 AM IST

ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన వినతి మేర స్పందించి మూడు నౌకల్లో ఆహారం, దుస్తులు, ఔషధాలను పంపించినట్లు భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఇడాయ్ తుపాన్ మొజాంబిక్ దేశంలో తీరప్రాంతమైన బెయిరాను తాకడం వల్ల మొజాంబిక్ తోపాటు జింబాబ్వే, మాల్వాయి దేశాల్లో భారీ నష్టం వాటిల్లిందని రెడ్ క్రాస్ అంతర్జాతీయ సొసైటీ ప్రకటించింది.
Read Also : సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

మొజాంబిక్ లోని తీరప్రాంత నగరం బెయిరాకి దేశంతో సంబంధాలు తెగిపోయాయని,90శాతం నగరం నాశనమైపోయిందని రెడ్ క్రాస్ తెలిపింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది.వరదనీరు ఇళ్లతోపాటు పంటలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. గడిచిన నాలుగు రోజులుగా 1,000మందికి పైగా చనిపోయారని,ఇడాయ్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన తర్వాత మొజాంబిక్ ప్రధానమంత్రి పిలిపీ నైసీ తెలిపారు.
Read Also : ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ