నవంబర్-30వరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2020 / 02:56 PM IST
నవంబర్-30వరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు

Updated On : October 28, 2020 / 3:03 PM IST

India Extends Suspension Of Scheduled International Flights కరోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ సివిల్ ఏవియేషన్​(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీయ విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కార్గో సేవలకూ అంతరాయం ఉండదని పేర్కొంది.



కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సేవలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, మే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’​లో భాగంగా ప్రత్యేక అంతర్జాతీయ విమానసర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎయిర్​ బబుల్ ఒప్పందంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన దేశాలకు జులై నుంచి ప్రత్యేక విమాన సేవలు ప్రారంభమయ్యాయి.



https://10tv.in/mha-extends-unlock-5-0-guidelines-till-november-end/
ఎయిర్​ బబుల్ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలతో విమాన ప్రయాణ ఒప్పందాలు భారత్ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్​కు, ఆయా దేశాలకు మధ్య విమాన సేవలు ఉంటాయి. అమెరికా , యూకే , యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్​ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి.