Gold Imports : బంగారం, వెండి ప్రియులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం.. దిగుమతి సుంకాన్ని భారీగా పెంపు..
Gold Imports : కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. అంతకుముందు బంగారం, వెండి వంటి లోహాలపై దిగుమతి సుంకం 6శాతంగా ఉండగా.. దీనిని ఇప్పుడు ఒకేసారి 15శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5శాతం నుంచి 10శాతానికి పెరగ్గా.. అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 1శాతం నుంచి 5శాతానికి చేరింది.
Gold Imports
Gold Imports : ప్రపంచంలో చైనా తరువాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారతదేశం కొనసాగుతోంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6శాతంగా ఉంది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో బంగారం, వెండి, ప్లాటినంతోపాటు ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి.
Also Read : Telangana Govt : హైదరాబాద్లో స్థలం ఉందా..? భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్. .
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సభావేదికగా దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చునని ఆయన పేర్కొన్నారు. అయితే, తాజాగా.. బంగారం, వెండిపై 6శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. అంతకుముందు బంగారం, వెండి వంటి లోహాలపై దిగుమతి సుంకం 6శాతంగా ఉండగా.. దీనిని ఇప్పుడు ఒకేసారి 15శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5శాతం నుంచి 10శాతానికి పెరగ్గా.. అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 1శాతం నుంచి 5శాతానికి చేరింది. ఇలా మొత్తంగా 15శాతానికి పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అదేవిధంగా ప్లాటినం దిగుమతులపై సుంకం 5.4శాతం పెంపు చేసింది. బంగారం, వెండి లోహాల దిగుమతులను తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలాఉంటే.. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9శాతంగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
