Telangana News: హైదరాబాద్‌లో స్థలం ఉందా..? భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..
Telangana Govt : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి భారీ శుభవార్త చెప్పింది.
Telangana Government to Grant Indiramma House If Land Available in Hyderabad City
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఉన్నవారికి శుభవార్త
- ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు
Telangana News : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో స్థలం ఉంటే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు (Indiramma Hous) మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన హౌసింగ్, రెవెన్యూ అంశాలపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పలు శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సొంత స్థలం ఉండి, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారికి మే నెల చివరిలోగా ఇంటి మంజూరు పత్రాలను అందజేస్తామని వెల్లడించారు.
జూన్ 2న అదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై 21న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాలనీలకు 5 లేదంటే 8 కిలోమీటర్లలోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
పేదలు నివస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలో మీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని స్థలాలు గుర్తించి, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
