2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 03:41 PM IST
2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం

Updated On : March 25, 2020 / 3:41 PM IST

కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు ఇప్పటికే ఆయా వర్గాల నుంచి సమాచారమందింది. నాలుగైదు రోజుల్లో రూ.1.5 లక్షల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించొచ్చని విశ్వాసనీయ వర్గాల సమాచారం.

కేంద్రం ఇంకా ఆర్థిక ప్యాకేజీని ఓకే చేయలేదు. ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మధ్య ప్యాకేజీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే ఈ అధికారులలోని ఒకరు ఆ ప్యాకేజీ 2.3లక్షల కోట్లుగా కూడా ఉండే అవకాశముందని చెప్పారు. అయితై ఫైనల్ నెంబర్స్ గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ వారం చివరిలోగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటన ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక ప్యాకేజీ డబ్బులను నేరుగా పేదల అకౌంట్లలోకి బదిలీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. కాగా కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే కరోనా కేసులు 600 దాటాయి.

See Also | గుడ్ న్యూస్ : తెలంగాణ, ఏపీలో నేడు నమోదు కాని కరోనా కేసులు